Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

‘భూ’ దళారులను తరిమేస్తాం..!

leave a comment »

అఖిలపక్ష పార్టీ నేతల శపథం
పేదల పొట్టకొట్టే అభివృద్ధి వద్దు

polepally-mahadharna

మహబూబ్‌నగర్‌, జడ్చర్ల – న్యూస్‌టుడే

పేదలను బెదిరించి లాక్కున్న భూములను వాళ్లకే ఇవ్వకపోతే భూ దళారులను తరిమికొడుతామని అఖిలపక్ష పార్టీల నేతల శపథం చేశారు. సెజ్‌ల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల బతుకు బుగ్గి చేస్తోందని అగ్రహించారు. అడ్డదారిలో భూములను తీసుకున్న పారిశ్రామికవేత్తలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో రూ.కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. పోలేపల్లి సెజ్‌ బాధితుల భూమిని తిరిగి ఇచ్చేదాకా పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి సెజ్‌ వద్ద సీపీఐ నేతృత్వంలోని అఖిల పక్ష బృందం మహాధర్నాను చేపట్టింది. తెదేపా నేత ఎర్రన్నాయుడు, తెరాస అధినేత చంద్రశేఖరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, ప్రరాపా అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్‌లతో పాటు లోక్‌సత్తా, సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ, రిపబ్లికన్‌ పార్టీ, ప్రజాఫ్రంట్‌, జనతాదళ్‌(ఎస్‌), విరసం, సెజ్‌ వ్యతిరేక కమిటీల నేతలు పోలేపల్లి సెజ్‌ బాధితులకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

సెజ్‌లపై శ్వేతపత్రం

రాష్ట్రంలో 96 సెజ్‌లను ఇచ్చారు. వీటిలో ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలను పెట్టారు..? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? శ్వేతపత్రం విడుదల చేయాలని తెదేపా పార్లమెంటరీ నేత ఎర్రన్నాయుడు డిమాండ్‌ చేశారు. మూడునెలల్లోపు కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలేపల్లి సెజ్‌ బాధితులకు న్యాయం చేయకపోతే ఆ పార్టీని నిమజ్జనం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీఐఐసీ, హుడాలు ప్రభుత్వానికి దళారీగా వ్యవహరించి పేదల భూములను బడాబాబులకు కట్టబెడుతున్నాయని ఆరోపించారు.

తెలంగాణతోనే పరిష్కారం

ఈ ప్రభుత్వం పేద రైతుల సమస్యలను పరిష్కరించలేదు.. తెలంగాణ రాష్ట్రం కనుచూపు మేరలో కనిపిస్తోంది. రాగానే ప్రభుత్వం సెజ్‌పేరుతో అమ్మిన ధర ఇప్పిస్తాం.. లేకపోతే సెజ్‌ల నుంచి భూమి గుంజి రైతులకు ఇస్తామని తెరాస అధినేత చంద్రశేఖరరావు భరోసా ఇచ్చారు. సామాన్యుల సమాధులపై చేపట్టే పరిశ్రమలు వద్దు.. ప్రజల బతుకు బాగుకు పరిశ్రమలు కావాలని కోరారు. సంస్కార హీనుడు, భూ దళారీ ముఖ్యమంత్రికి ప్రజలన్నా, ప్రతిపక్షాలన్నా చులకన, 9 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తిని గౌరవించకుండా మాట్లాడిన వైఎస్‌కు రైతుల బాగోగులు ఏం పడుతాయని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ప్రజల సమస్యలను చెప్పకుండా ప్రభుత్వానికి అనుకూలంగా భజనలు చేస్తాయా..? అంటూ వైఎస్‌ తీరును దుయ్యపట్టారు. సెజ్‌ పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆధ్యయన కమిటీ వేద్దామని కేసీఆర్‌ సూచించారు.

సామాజిక తిరుగుబాటు తప్పదు

పేదల భూములు గుంజుకొని పరిహారం ఇవ్వాలంటే అది అసైన్‌ భూమి, ప్రయివేటు భూమంటూ చెబుతున్నావ్‌.. అబ్బ సొత్తు ఇవ్వలే.. భూములు కొల్పోయిన రైతులతో సమాజిక తిరుగుబాటు తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ముఖ్యమంత్రిపై విరుచుక పడ్డారు. ప్రభుత్వం ఒకసారి పేదలకు భూమి ఇచ్చిన తర్వాత మళ్లీ నా భూమి అంటూ రావడం ఏమిటని గద్దించారు. పేదలకు ఇచ్చిన తర్వాత వాళ్ల సొంతమే.. ప్రభుత్వ భూమి కాదని స్పష్టం చేశారు. నీ ఇష్టమొచ్చినంత పరిహారం ఇస్తే ఊరుకోం..అంటూ గర్జించారు. చంద్రబాబు అన్యాయం చేశారంటున్నావ్‌.. నీవు న్యాయం చేయవయ్యా..అంటూ ప్రశ్నించారు. నా ప్రాణం పోయిన సరే.. పోలేపల్లి బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కోస్తా కారిడర్‌లో నాలుగులైన్ల రోడ్డు వేసి ఎడ్లబండి నడుపుతావా..? చేపలు పడుతావా..? రిక్షాతోలుతావా..? అని ఎద్దేవా చేశారు. వైఎస్‌, గొల్లపల్లి వివాదంతో దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు.

మీ కోసం దెబ్బలైనా తింటాం

పోలేపల్లి సెజ్‌ బాధిత రైతులు పొలాలు కోల్పోయి కూలీలుగా మారడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పేర్కొన్నారు. సెజ్‌ను వ్యతిరేకించి ఆరుసార్లు దెబ్బతిన్నారని చెబుతున్నారు.. మీ కోసం ఎన్ని దెబ్బలైనా తింటామని పేర్కొన్నారు. ఈ మందుల పరిశ్రమలు పేదలకు ఉద్యోగాలను కల్పించలేవు.. ఉపాధి చూపించలేవు.. కానీ కాలుష్యాన్ని వెదజల్లడానికి వీలుందన్నారు. పరిశ్రమలకు త్యాగం చేసిన రైతులు సంతోషంగా ఉంచే బాధ్యత ప్రభుత్వంపై లేదా..? అని ప్రశ్నించారు. పరిశ్రమల్లో వాటా ఇస్తేనే రైతులు ఆందోళనలను విరమిస్తారని తేల్చిచెప్పారు.

చుక్కమ్మ కళ్లలో కాంతి చూడాలి

పోలేపల్లి సెజ్‌లో సర్వం కోల్పోయిన రైతుల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.. వాళ్ల పొలాల్లోనే కూలీలుగా ఉన్నారు. నరహంతక రాక్షస ప్రభుత్వానికి చరమగీతం పాడాలని ప్రజలకు ప్రరాపా అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. చుక్కమ్మ కళ్లలో కాంతి చూడాలని ప్రరాపా భావిస్తోందన్నారు. రైతులకు, ప్రభుత్వానికి మధ్య పోరాటంగా చెప్పారు.

Courtesy: Eenadu 5th Nov 2008

Advertisements

Written by dilkibaatein

November 5, 2008 at 8:39 am

Posted in News Archive, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: