Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పార్టీలోల్లకి పోలేపల్లి దండాలు

with 3 comments

అయ్యలార, మీకు పేరు పేరున దండాలు!
గీనాటికైనా మీ బంగ్లాల నుంచి మా ఊరికొచ్చిండ్లు
కెమరాలనెంటేసుకొని కొంత సమయాన్నిచ్చిండ్లు
నవ్వుకుంట కలిసిమెల్సి బండ్ల మీద వొచ్చిండ్లు

మా ‘పోరు పల్లే కు ఆఖరికి కదిలి వొచ్చిండ్లు
అయ్యలార, మీకు పేరు పేరున దండాలు!
నాలుగేండ్ల సంధి పోలేపల్లి ఒక అనాధ
నలభై మంది సావు జూసిన ఓ బలిపశువు
అయినా గట్లనే పోరాటం చేస్కుంటొచ్చినం
గియ్యాల అందరు పోటీపడి పోలెపల్లి అంటున్రు
ఏదో ఒకటి చేస్తం ఇంకొంత ఓపికపట్టుండ్రి అంటున్రు
అయ్యలారా మీ శాంతికి నవ్వుకీ పేరుపేరునా దండాలు

గంపెడాశతో ఎదురు చూశినం పెద్దోల్లొస్తుండ్రని
ఎప్పటిలెక్కనె వచ్చిండ్రు పోయిండ్రూ
వచ్చినోల్లు నాలుగు ముక్కలు చెప్పిండ్రు
గంతే ఇంకేమున్నది అంతకంటె ఇంకేమిగాలే

పార్టీలోల్లు వస్తెనన్న ఫాక్టరీలు బందు పెడ్తరనుకున్నం
అందరు గల్సి మాతో పోరాటం చేస్తరనుకున్నం
ఏంగాలే మొన్నెక్కడున్నమో గాడనే ఉన్నం
సచ్చినోల్లు గుర్తొచ్చి కండ్లు తుడుసుకొన్నం
అయ్యలారా మీకు మాత్రం ఎలెక్షన్ల కోసం పనికి ఒచ్చినం
మీమీ అజెండాలల్ల మేము మల్లి నలిగి పోతున్నం
మా కడుపులు ఆకలితొ మండుతనే ఉన్నై
మా ఆశలు అట్లనే గాల్లో తండ్లాతనే ఉన్నై

పోలెపల్లి పోరు ఒక భాద్యతని మీ నెత్తిన పెట్టింది
మిమ్మల్ని ఒక తాటికి తెచ్చింది
కలిశి గొంతు ఇప్పిన్రు గని..చేతలు మాత్రం ఏం గాలే
అయ్యలార మీకు పేరుపేరున దండాలు

ఒక దొర తెలంగాణొస్తే మీకేమైనా చేస్తం అన్నడు
ఒకాయన సెజ్జులల్ల మీకు వాట గావలె అన్నడు
ఇంకొకాయన సెజ్జులల్ల ఎక్కువ పైసలడగాలె నన్నడు
మీరెందుకొచ్చిండ్లని ఒకరి ముఖమొకరము జూసుకొన్నం

మా పోరు చూడనీకొచ్చినోల్లు మా మాటే చెప్తరనుకున్నం
మీరు మాత్రం నిమ్మలంగ మీ పాటలె పాడిన్రు
మీకు రాజ్యమిస్తనే మల్ల పోలేపల్లి జూస్తమన్నరు
దొరలారా మీకు వెయ్యెయ్యి దండాలు!

చాతనైతె మా పోరుల గలువుండ్రి మా గోస చెప్పుండ్రి
లేకపోతే మా బతుకులు మాకు ఒదిలి సక్కగ పోండ్రి
ప్రతొక్కడు నన్నే ముఖ్య మంత్రి చెయ్యమంటున్నడు
ఎంతమంది మీ మీ పార్టీల కొస్తరని లెక్కలు గడ్తున్రు
బతుకు కోసం పోరాటం చేస్తున్న జనాల్ని
పానం లేని మీ పార్టీలల్ల అప్పచెప్పకున్రి
మీకెవ్వరికి చాతకాక పోతె మల్లిటువైపు రాకుండ్రి
అయ్యలార మీకు పేరుపేరునా దండాలు

మా తలరాతలు మేమే రాసుకుంటం
పోలేపల్లి చరిత్రని తిప్పి చూసుకొండ్రి
మోసం చేసిననోన్ని ఊరవతలకెల్లగొట్టినం
ఐనా మల్లొకసారి మోసం జేస్తమంటే
తెలంగాణ గడ్డ మీద పుట్టగతుల్లేకుండ జేస్తం

Advertisements

Written by Sujatha Surepally

November 7, 2008 at 1:42 am

Posted in Poetry, Telugu

Tagged with , , , ,

3 Responses

Subscribe to comments with RSS.

 1. namesthe
  kamrede sujatha madam
  this is very excellent poem about the polapally
  it is very intresting and it is one of the realization of telngana people.
  chaala bagundi ede prathiokkararu spandinchalsina matter

  bhaskar.s

  November 12, 2008 at 1:07 pm

 2. excellent….u have rightly understood the ‘love’of politicians towards polepally sez…beware of them…one of them may identify u as ‘nalgonda muddubidda’..but u always treat him as a ‘telangana dora’ …telugulo kooda baaga rayagalanani ee poem to meeru niroopinchukunnaru..congrats.

  jaanu

  November 13, 2008 at 12:36 pm

 3. its a good poem..

  sky baba

  December 5, 2009 at 8:11 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: