Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

మోసపు పునరావాసం బట్టబయలు

leave a comment »

పోలేపల్లి సెజ్ బాధితుల ఉద్యమానికి రోజు రోజుకూ పెరుగుతున్న మద్దతుతో భయపడుతున్న ప్రభుత్వం ఏదో ఒక విధంగా దీన్ని దెబ్బతీసేందుకు ప్రణాళికలు మొదలుపెట్టింది. జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ఏ.పి.ఐ.ఐ.సి, ఫార్మా సెజ్ ను నిర్మిస్తున్న హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మా, స్థానిక ఎమ్మెల్యే మల్లు రవి కలిసి సెజ్ బాధిత రైతులకు పునరావాస పధకం అనే పేరు మీద గత కొంతకాలంగా ఒక కొత్త డ్రామా ఆడ్డుతున్నారు.

సెజ్ కొరకు సేకరించిన భూమిలో ఒక మూల కొంత భూమిని ప్లాట్లుగా విభజించి బాధిత రైతులకు ఆ ప్లాట్ల “పట్టాలు” రెణ్నెళ్ల కిందట హడావిడిగా పంపిణి చేశాడు స్థానిక ఎమ్మెల్యే మల్లు రవి. అయితే ఆ పట్టాలు లీజుతో సమానమనీ, బోగస్ అని అర్థం చేసుకున్న బాధితులు మరునాడే ఎమార్వో ఆఫీసు ముందు ధర్నా కూడా చేశారు.

ఇప్పుడు తాజాగా ఆ డ్రామాకు కొనసాగింపుగా ఆ ప్లాట్లలో ఇళ్లు కట్టుకోవడానికంటూ  రైతులకు “70,000 రూపాయలు మీ పేరు మీద బ్యాంకులో వేశాం వచ్చి తీసుకోండి” అంటూ గత నెలరోజులుగా ఎమ్మెల్యే, కలెక్టర్ కలిసి అనేక సార్లు రైతులకు రాయబారాలు పంపారు.

పోలేపల్లి సెజ్ భూసేకరణలో భూములు కోల్పోయిన అనేకమంది రైతులు దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. కూలి చేస్తే కానీ పూటగడవదు వీరికి. ఇక కూలి చేయలేని ముసలి రైతుల బాధ వర్ణనాతీతం. వారికయితే పస్తులే దిక్కు. ఇటీవల జరిగిన చిరంజీవి పర్యటన పర్యవసానంగా ఇటువంటి అశక్తులైన ముసలివారి కొరకు రోజూ ఒక పూట భోజనం కూడా ఏర్పాటు చేశారు ప్రజా రాజ్యం పార్టీ కార్యకర్తలు.

ఇటువంటి దుస్థితిలో ఉన్న రైతుల వద్దకు రోజూ బ్రోకర్లను పంపించి మీ 70,000 రూపాయలు త్వరగా తీసుకోండి అంటూ వత్తిడి చేశారు ఎమ్మెల్యే మరియు కలెక్టర్.

ఈ వత్తిడి ఫలితంగా కొంతమంది రైతులు ఆ సొమ్ము తీసుకోవడానికి స్థానిక సంగమేశ్వర గ్రామీణ బ్యాంకుకు వెళ్లారు. ఇక్కడే ప్రభుత్వం చేస్తున్న మరో కుట్ర బయట పడింది. డబ్బులు ఇచ్చే ముందు ఆ నిరక్షరాస్యులైన రైతుల చేత తమ ఇష్టం వచ్చిన కాగితాలపై వేలిముద్రలు తీసుకున్నారు బ్యాంకు అధికారులు. ఈ విషయం తెలుసుకున్న పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య సంఘటన సభ్యులు సదరు బ్యాంకు నుండి ఆ వేలిముద్రలు పెట్టించుకుంటున్న కాగితాలు సంపాదించారు. అందులో దిగ్బ్రాంతికరమైన నిజాలు వెల్లడయ్యాయి.

ఆ కాగితాల్లో ఉన్న వివరాల ప్రకారం ఈ డబ్బును ఇస్తున్నది ప్రభుత్వం కాదు. ఈ డబ్బు ఇస్తుంది హెటెరో డ్రగ్స్ అనే ప్రైవేటు సంస్థ.

పునరావాస పధకం కింద రైతులతో హెటెరో డ్రగ్స్ కు కుదిరిన ఒక ఎం.వో.యూ (అవగాహనా ఒప్పందం) ప్రకారం ఈ సొమ్ము ఇస్తున్నట్టు బ్యాంకు వారు వేలిముద్రలు చేపించుకుంటున్న ఒప్పంద పత్రాల్లో ఉంది.

చెక్కులు ఇచ్చాక రైతులు సంతకం చేస్తున్న రసీదు చూడండి:

cheating-receipt

(పూర్తి సైజులో చూడడానికి బొమ్మపై క్లిక్ చేయండి)

 

అసలు పునరావాస పధకానికి నిధులు ప్రభుత్వం ఇవ్వాలి కానీ హెటెరో డ్రగ్స్ యాజమాన్యం ఇవ్వడమేమిటి? రైతులకు సెజ్ యాజమాన్యానికి ఎన్నడూ జరగని ఒక ఒప్పందానికి లోబడి ఈ డబ్బులు ఇస్తున్నట్టు ఆ నిరక్షరాస్యులైన రైతుల చేత వేలిముద్రలు వేయించుకుని డబ్బులు ఇవ్వడం ఏమిటి?. ఈ పని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు ఎందుకు చేస్తుంది? అయినా పునరావాస పధకమైతే  ప్రభుత్వం ఇళ్ళు కట్టించి ఇవ్వాలి కానీ ఇలా 70,000 రూపాయలు చేతిలో పెట్టడం ఏమిటి?  రైతులకు, సెజ్ యాజమాన్యానికి కుదిరిందని చెప్పబడుతున్న సదరు ఒప్పందంలో ఏ దుర్మార్గపు షరతులు ఉన్నాయి?

ఇది ఉద్యమాన్ని నీరుగార్చడానికి రైతులను మభ్యపెట్టడం కాక మరేమీ కాదు.

పోలేపల్లి సెజ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంపై సాక్షి పత్రిక ఎంత అన్యాయంగా రిపోర్టు చేస్తుందో మొన్ననే చెప్పాం. ఇప్పుడు సాక్షి నిస్సిగ్గుగా మరోసారి అదే పని చేసింది. అన్యాయంగా రైతుల పొట్టగొట్టడమే కాక సిగ్గూ ఎగ్గూ లేకుండా వారిని ఇంకా మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని వెనకేసుకు వస్తున్న పెట్టుబడి విష పుత్రిక సెజ్ యజమానుల కరపత్రం అయిన సాక్షి పత్రిక ఎంత దుర్మార్గంగా “డబ్బెవరికి చేదు” అంటు రాసిన దొంగ కధనం చూడండి. అదే వార్తా కధనం చివర “ఆందోళనలో రైతులు” అంటూ అసలు నిజాన్ని కూడా సాక్షి బయటపెట్టడం కొసమెరుపు.

sakshi-bank1

ఈ కధనంతో ఆగ్రహించిన పోలేపల్లి రైతులు నిన్న నవంబర్ 7వ తారీఖు నాడు జడ్చర్లలో సాక్షి పత్రికను తగులబెట్టారు.

మోసపూరిత ఒప్పందాలపై సంతకాలు తీసుకున్నందుకు  నిరసనగా 7 నవంబర్ నాడు పోలేపల్లి రైతులు బాదేపల్లి గ్రామీణ బ్యాంకు ముందు ధర్నా చేశారు. ఆ ఒప్పంద పత్రాలను దగ్ధం చేశారు.

ఆ ధర్నా వార్తలను కింద చదవండి:

వార్త దినపత్రిక:

vaarta-bank1

vaartha-bank21

ఈనాడు దినపత్రిక:

eenadu-bank

Advertisements

Written by dilkibaatein

November 10, 2008 at 9:06 am

Posted in Articles, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: