Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పోలేపల్లి సెజ్ మరో రైతును బలిగొన్నది!

with 2 comments

ఓ వైపు ఉద్యమం నడుస్తూనే ఉంది, దాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వమూ, సెజ్ దొరలూ కలిసి కుట్రలు పన్నుతూనే ఉన్నారు. కానీ పోరాటం చేసి చేసి అలసిన ఒక గుండె మాత్రం ఆగిపోయింది. నలుగురికీ ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియని  ఆ రైతన్న నష్టపరిహారం కొరకు ఆత్మాభిమానం చంపుకుని అధికారుల కాళ్లావేళ్లాబడినా సదరు అధికారులు కనికరించలేదు. ఓ వైపు భూమి పోయిన బాధ మరో వైపు అప్పుల బాధ రాములు గౌడ్ ను కుంగదీసి చివరికి అతని ఉసురు దీశాయి. నాలుగేళ్లకు పైబడి పోలేపల్లి రైతులు ఆందోళన చేస్తుంటే కుంభకర్ణ నిద్రనటిస్తోంది వైయెస్ సర్కారు. రాములు గౌడ్ మరణంతో పోలేపల్లి సెజ్ కబళించిన వారి సంఖ్య 43 కు చేరింది.

ఆ రైతుల ఉసురు తాకి వైయెస్ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలటం ఖాయం.

రాములు గౌడ్ మృతికి పరోక్షంగా కారణమైన అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని, పోలేపల్లి సెజ్ కొరకు సేకరించిన భూములు వెంటనే రైతులకు తిరిగి ఇవ్వాలని పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య సంఘటన డిమాండ్ చేస్తుంది. రాములు గౌడ్ కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.

* * *

ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్త

ramulu-goud1

****

ఈనాడు దినపత్రిక వార్త

ఉసురుతీసిన సెజ్‌

పరిహారం అందక బాధితుని మృతి

జడ్చర్లగ్రామీణం,బాలానగర్‌, న్యూస్‌టుడే:పోలేపల్లి గ్రీన్‌పార్కులో భూములు కోల్పోయి న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో బాలానగర్‌ మండలం రాపల్లె గ్రామానికి చెందిన పాలెం రాములుగౌడ్‌ మృతి చెందారని పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన కన్వీనర్‌ మధుకాగుల ఆరోపించారు. పునరావాస ప్యాకేజిలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం ఒక కుటుంబంలో ఒకరికే పునరావాస ప్యాకేజి వర్తింపజేయడంతో రాములుగౌడ్‌ గుండె ఆగిపోయిందని ఆయన మండిపడ్డారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పోలేపల్లిలోని 420 సర్వేనెంబరులో మృతుడు రాములుగౌడ్‌ తండ్రి ఆగమయ్య పేర ఆరు ఎకరాల 20 గుంటలు భూమి పోలేపల్లి గ్రీన్‌పార్కు కోసం సేకరించిన భూముల్లో పోయింది. ఇందుకు అప్పట్లో నష్టపరిహారం అందించారు. కానీ గతకొన్ని రోజులుగా పోలేపల్లి సెజ్‌ బాధితులు చేస్తున్న పోరాటాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పరిహారం రూ.70వేలు, ఇళ్ల స్థలాల కోసం రాములుగౌడ్‌ అధికారుల చుట్టు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరిగారని వారు తెలిపారు. బుధవారం పక్కనే ఉన్న గ్రామం వీరన్నపల్లిలో తన సోదరి వద్దకు వెళ్లి తన గోడును వినిపిస్తూ పునరావాస పరిహారం తమకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ఈ సందర్భంగానే ఒక్కసారిగా రాత్రి 10 గంటలకు గుండెపోటు రావడంతో ఆయనను షాద్‌నగర్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై జడ్చర్ల తహసిల్దారు కార్యాలయంలో విచారించగా మృతుడి తండ్రి ఆగమయ్య పేరుమీద ఉన్న భూమి సేకరణలో తీసుకున్న విషయం వాస్తవమేనని డిప్యూటీ తహసిల్దారు చంద్రమౌళి తెలియజేశారు. ఈ విషయంలో రాములుగౌడ్‌, అతని సోదరుడు జగన్నాథంగౌడ్‌లు పరిహారం కోసం ప్రయత్నించారని, అధికారుల చుట్టూ తిరిగిన విషయం వాస్తవమేనని వారికి అందాల్సిన పరిహారాన్ని అందజేసేందుకు ప్రయత్నం చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు.

Advertisements

Written by dilkibaatein

November 21, 2008 at 11:26 am

Posted in News Archive, Telugu

2 Responses

Subscribe to comments with RSS.

 1. జీవించే హక్కును కాపాడుకుందాం

  అభివృద్ధి ముసుగులో ప్రజలను నిర్వాసితులుగా, నిరాశ్రయులుగా మార్చే అభివృద్ధి నమూనాను పాలక వర్గాలు యథేచ్ఛగా అమలుచేస్తున్నాయి. రైతులు, వ్యవసాయ కూలీలు, వివిధ వృత్తులవారి జీవనోపాధిని, జీవించే హక్కును హరించి వేస్తున్నాయి. అభివృద్ధి కోసం త్యాగాలు చేయాలని, నిర్వాసితులు కాకుండా ప్రాజెక్టులు, సెజ్‌లు, పోర్టులు, పరిశ్రమలు నెలకొల్పడం సాధ్యం కాదనే భావన నిజమే అని చాలామంది అభిప్రాయపడతారు. కాని ఈ ఆలోచన వెనుక ప్రజల హక్కులను జీవితాలను విధ్వంసం చేసే ప్రయత్నం ఉంది.

  వ్యవసాయంపై ఆధారపడిన 65 శాతంమంది జీవనోపాధిని కాలరాసే దుర్మార్గమైన పథకం ఉంది. దేశంలో నూ, రాష్ట్రంలోనూ సెజ్‌లకు వ్యతిరేకంగా ఆందోళనలు, కోస్టల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను ఎక్కడికక్కడ అడ్డుకునే పోరాటాలు జరుగుతున్నాయి. ఆ ఆందోళనల్లో నక్సలై ట్లు ఉన్నారని ప్రచారం చేస్తోంది ప్రభుత్వం. ప్రజలు తమ జీవనోపాధికోసం, జీవించే హక్కుకోసం పోరాడుతున్నారు. అది వారి జీవన్మరణ సమస్య.

  నక్సలైట్ల పేరు చెప్పి, శాంతిభద్రతల సమస్య అని ఆ పోరాటాల్లో ఉన్న ప్రజాస్వామిక ఆకాంక్షను, న్యాయమైన డిమాండ్లను నిరాకరించడం, అణి చివేయడం అన్యాయం. ఈ అణచివేత, నిర్బంధాలపట్ల నిశ్శబ్దంగా ఉండటం కూడా నేరమే! అభివృద్ధి ప్రజల అవసరాలకు ప్రయోజనాలకు అనుగుణంగా జరగాలి. అసమానతలు సృష్టించేది నిజమైన అభివృద్ధి కాదు.

  పేదరికాన్ని పెంచేది అన్యాయమైన అభివృద్ధి. అందుకే ప్రభుత్వాల అభివృద్ధి నమూనాను అందరం వ్యతిరేకిద్దాం. సెజ్‌ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేద్దాం. 22.11.2008న ఉ.10గం.లకు గుంటూరులోని ఎన్‌జీవో కళ్యాణ మండపంలో ప్రారంభ సమావేశం జరుగుతుంది. పాలకుల అభివృద్ధి నమూనా-ప్రజాస్వామిక హక్కులు అనే అంశంపై సుజాతో భద్ర (బెంగాల్‌), సెజ్‌ల పై ప్రొ॥ఘంటా చక్రపాణి మాట్లాడతారు. 4గ.లకు ఊరేగింపు, 5గం.లకు బహిరంగ సభ జరుగుతుంది. ప్రజలు, ప్రజాస్వామికవాదులందరూ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం.

 2. chipko (HUGGING)

  September 12, 1731: Maharajah Ajit Singh of Jodhpur, a princely kingdom in what is now Rajasthan, the westernmost state of modern India, decided to build a new palace. His ministers sent an army of men into the desert reaches to bring back wood for burning lime, necessary for construction.

  Included in the Maharajah’s domain was Khejare, a small village among several in the desert, surrounded by a small forest. The villagers, members of a reform Hindu sect known as the Bishnois, included in the 29 tenets of their faith the protection of trees and wildlife, and thus had been able to nurture the forest for generations. The Bishnois consider the black buck antelope and the chinkara (Indian gazelle) sacred, and the latter to this day is generally found around Bishnoi settlements. Community-accepted legend has it that Bishnoi women would suckle the young of a chinkara if its mother deserted it or was killed.

  When the Maharajah’s men approached, an elderly woman named Amrita Devi pleaded with him that the felling of trees was not only against the Bishnois faith, but that trees provided the village with food and fodder and were the protectors of the villagers’ water supply, vital to their desert existence. Seeing the axeman unmoved, Amrita Devi grabbed the tree in her outstretched arms and hugged it. The axeman threw her to the ground. She got up and hugged the tree once more, begging the axeman to chop her down first before destroying the tree. The axeman hacked through her body, only to have Amrita Devi’s three daughters come forward to hug the tree and meet the same fate. On September -12- 1731:, 363 people went to their death hugging trees.
  After hearing of the incident, the Maharajah, seeking to make amends, declared a permanent injunction against the felling of trees or the killing of wildlife in the area, and permanently exempted the villages from all land taxes. To the day the villages around Amrita Devi’s home remain a green and wildlife-filled preserve amidst the sandy isolation of the Rajasthan desert, and Amrita Devi’s village itself has now been declared India’s first national environmental memorial.

  This is the (to my knowledge) same Bishnoi sect people who put a case on Film Actor Salman Khan for hunting down chinkara (Indian gazelle) .

  If Amrita devi can defend the Army of the “Maharajah” why can’t we defend this “raja” Chief minister of AP. To get back our life,land,And livelihood .

  Note : Please make a translation of this into telugu or take this idea into every person through pamphlets.

  telangana

  December 26, 2008 at 5:17 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: