Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

ఇంకొ పానం బలై పోయిందా !

with one comment

రాములన్న క్షమించే
నాలుగేండ్లు నలభై మంది సచ్చినా
ఎవరెన్ని చెప్పినా అన్యాయాన్ని ఎదిరించి పోరాడినా
అన్నా ఇంకొక దీపం ఆరిపోకుండ ఆపుకోలేకపోయినమే

రాములు గౌడ్‌

రాములు గౌడ్‌

రాములన్నా నువ్వు చివరివరకు పోరాడుతవు
ఆకలి కడుపలు ఎంత మాడినా
సెజ్ రాక్షసుల మెడలు వంచేంతవరకు
పోరాడుతవనుకునే నిన్ను కాపాడుకోలేక పొయినమే

ఎన్ని రాత్రులు ఎవలకి చెప్పకుండ ఎడ్చినవో
ఎప్పటికైనా మన భూములు మనకొస్తయని
ఏదొక నాయం జరుగుతదని
చూసి చూసి కళ్ళు కాయలు కాసి
ఆశలు సచ్చి అఖరికి అనంత లోకాల్లోకి
అందనంత దూరంగ పోయినవా
రాములన్నా నిన్ను కాపాడుకోలేకపోయినమే
నీ పోరు బాటకి పోలెపల్లి ఊరు ఈరోజు కన్నీరైందన్నా
క్షమించే నిన్ను కాపాడుకోలేక కుములుతున్న పోలేపల్లిని

ముగ్గురన్నదమ్ములున్నకాడ ఒక్క ఇంటి జాగ ఇచ్చి
డెబ్బై యేలు మోఖాన గొట్టి మా పనైపోయిందని సర్కారంటే
ఇంతమంది ఎట్ల బతకాలె అని
దేసంల సదువుకొన్నోల్లకి ల్లెఖ్ఖలు తెల్వవా అని అడుగుతున్నవా అన్నా

ఒకని బతుకు కొల్లగొట్టి మీరేం బాగుపడ్తరు అంటున్నవా?
ఇనేటొడు లేక, యిన్నా పట్టించికొనేల్లు లేక,
పోరాటాలు తిండిబెడ్తలేవు, బట్టనిస్తలేవని
పెళ్ళాం పిల్లల్ని అనాధలు చేసి పోయినావే?

క్షమించన్న దేనికి పనికిరాని మమ్మల్ని
నిన్ను కాపాడుకోలేకపోయినమన్నా
కొంత మంది స్వార్థాలు చూసుకొని నీ భూమి గుంజుకోని
కోట్లకి పడగలెత్తుదామనీ గిదే అభివృద్ది అంటున్రు

నీ చావైనా కొంత మందిని కదిలిస్తదనుకున్నవా
నీ లెక్క ఇంకొల్లు బాదపడొద్దు అనుకున్నవా
భూములల్లనె మా బతుకూ సావూ అని చెప్తామనుకున్నవా
రోజురోజు సచ్చే బతుకెందుకనుకొనావా

బంగ్లాలల్ల ఉండెటొల్లకు నీ అసంటొల్లు ఆకలితొ సస్తుంటె
వాళ్ళ పిల్లలు కుటుంబాలు బాగనే ఉన్నరు కదాని తెల్సుకొని
రాములన్నో మరెవరో దేశానికి త్యాగం చేయక తప్పదని
ఏమి చెయ్యలేమనే దేశోద్దారక ఏదాంతం వల్లిస్తున్నరు

చానమందికి నీ సావు ఒక వార్త కావొచ్చు
ఐనా రాములన్నా కొంత మందికి ఒక తన్లాట
రేపింకొక రైతు సావు కండ్లబడొద్దని
బతికినంతవరకు నాలుగు రోజులు సావొద్దని

రాములన్న నీ అఖరి ఊపిరి కూడ
ఊరందరికి జీవిత పాటం అయిందే
నువ్వేడున్నా నీకు కన్నిటి జోహార్లు
చాతగాని మా బతుకులకు ముక్కోటి జోహార్లు

Advertisements

One Response

Subscribe to comments with RSS.

  1. పోలేపల్లి సెజ్ బాధితురాలు నాగమ్మ బుధవారం సాయంత్రం ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందింది…యెవ్వరు ఈమె మరణానికి కారకులు?…యెవ్వరిని బాధ్యులుగా పెరుకొంటాం?ఇలా ప్రజలను భయభ్రాంతులను చెస్తూ బలవన్మరణాలకు తోడుపడుతున్న తెర్రరిస్టులు యెవ్వరు?…మనమెమి చెస్తాములే అని నిమ్మకు నీరెత్తినట్లున్న భద్రజీవులారా….వాళ్లు మీ కొసం కూదా వస్తారు…అప్పుడు మిమ్మల్ని కాపడటానికి యెవ్వరు మిగిలి ఉండరు…ముంబై లొ జరిగిందే తెర్రరిజం కాదు….తెర్రర్ చాల మంది స్రుష్టిస్తూ ఉన్నారు..గుర్తించండి…

    kjaanu

    December 4, 2008 at 6:10 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: