Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

మానవతను హరిస్తున్న అభివృద్ధి

leave a comment »

– భూనిర్వాసితుల పోరాట ఐక్య సంఘటన

అభివృద్ధిపేరిట ప్రభుత్వాలు తమను దగా చేస్తున్నాయన్న వాస్తవాన్ని గుర్తించిన పేద ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. వారికి బాసటగా నిలబడటం విద్యావంతుల నైతిక కర్త్యవం. సంపద సృష్టించే శ్రమ జీవుల పక్షాన నిలబడక పోతే అనతికాలంలోనే తమనూ అనేక సమస్యలు చుట్టు ముడతాయన్న నిజాన్ని విద్యావంతులందరూ గుర్తించాలి.

అనామకులుగా మిగిలిపోయిన, అసమాన త్యాగాలు చేసి చరిత్రకెక్కని సామాన్యుల ధైర్యంతో పోల్చదగింది మరేదీ లేదు. గుర్తింపును కోరుకోకుండా, మీడియా రక్షణ భరోసా లేకుండా న్యాయం కోసం పోరాడిన వారి ధైర్యమే ధైర్యం. అది మనల్ని విన మ్రులను చేస్తుంది. ఉత్తేజ పరుస్తుంది. మానవతలో మన విశ్వాసాన్ని ప్రగాఢం చేస్తుంది.

– ఆంగ్‌ సాన్‌ సూకీ


అభివృద్ధి! ఎక్కడ చూచినా అభివృద్ధే. అయితే ఇది ప్రజల జీవితాలను సుఖమయం చేసేది కాదు కదా, వారి బతుకులను విధ్వంసం చేసేది. ఈ అభివృద్ధి ఇప్పుడు మన అనుభవంలోకి వస్తున్నది. ప్రత్యేక ఆర్థిక మండలాలు (సెజ్‌లు), కోస్టల్‌ కారిడార్‌, గనుల తవ్వకాల ప్రాజెక్టులు, మౌలిక సదుపాయల మెరుగుదలకు ఉద్దేశించిన భారీ ప్రాజెక్టులు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి. అయితే ఇవి సామాన్య ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చేవేనా ? కావని వాస్తవాలు చెబుతున్నాయి. అయితే పాలకులు, వారికి మద్దతు నిస్తున్న మేధావి వర్గాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ అవి మేలు చేస్తాయని అంటున్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట ఆదివాసీలు, దళితులు, ఇతర పేదలకు ఉన్న కొద్దిపాటి భూమిని కూడా ప్రభుత్వం కైవసం చేసుకొని అపర కుబేరులకు కారుచౌకగా కట్ట బెడుతుం ది.

ఇదెలాంటి అభివృద్ధి? పేదల ఉపాధికి ఉన్న చిన్నపాటి అధరువును లేకుండా చేయడం ఎలాంటి అభి వృద్ధి? నీటి పారుదల సదుపాయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపట్టారు. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టునే తీసు కొంటే దానిమూలంగా వేలాది ఆదివాసి కుటుంబాలు, అంతకు మించి సన్నకారు రైతు కుటుంబాల వారు నిర్వాసితులయ్యారు. వారి పునరావాసానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టడం లేదు. ఇక ఆ డ్యామ్‌ మూలంగా ముంపునకు గురయ్యే అటవీ విస్తీర్ణం తక్కువేమీకాదు. ఎంతో విలువైన వృక్ష సంపద, జంతుజా లంకు తీరని నష్టం జరుగుతుంది. వీటికి తోడు పోలవరంతో ఏ ప్రాంతానికి ఎక్కువ లబ్ధి జరుగుతుందనే వివాదం. సకల ప్రాంతాల ప్రజల సంక్షేమాన్ని పాలకులు చిత్తశుద్ధితో అభిలషించకపోవడం వల్లే ఇటువంటి వివాదాలు చోటుచేసుకుంటున్నాయనేది ఒక కఠోర సత్యం.

ఆ ప్రాజెక్టు మూలంగా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌, ఒరిస్సాలలో దాదాపు 400 గ్రామాలు ముంపునకు గురవనున్నాయి. ఈ గ్రామాలలో 3 లక్షల మంది ఆదివాసీ లు నివసిస్తున్నారు. ఆధునిక ప్రపంచపు పోకడలు తెలియని ఈ అమాయక జనాన్ని ప్రభుత్వాధికారులే మోసం చేయడం గర్హనీయం. ఇక సత్వర పారిశ్రామికాభివృద్ధికి ఈనాటి పాలకులు కనిపెట్టిన కొత్త మార్గం సెజ్‌ల ఏర్పాటు . వీటి పేరిట వేలాది ఎకరాలను (అన్నీ పేదలవే) స్వాధీనం చేసు కొని పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్నారు. వారు అక్కడ నెలకొల్పే పరిశ్రమలకు ఎన్నో రాయితీలు. కార్మికుల శ్రమను దోపిడీ చేసిందు కు వారికి ఎన్నో హమీలు. పోలేపల్లి సెజ్‌ను ఫార్మా కంపెనీలకు ఇచ్చారు. ఆ కంపెనీల నుంచి వెలువడే విష వాయువులు దుందుభి, కృష్ణానదిలో కలిసే ఇతర చిన్న నదుల జలాలను పూర్తిగా కలుషితంచేసే ప్రమాదమెంతైనా ఉంది.

జంట నగరాలలో ప్రయాణికుల రవాణా సదుపాయాల నిమ్తితం మెట్రో రైల్‌ ప్రాజెక్టును చేప ట్టారు. జంట నగరాలలోని అనేక పేద, మధ్య తరగతి కటుంబాలు దీనివలన పెద్ద ఎత్తున నష్టపోనున్నాయి. విశాఖపట్నం సమీపంలో బాక్సైట్‌ గనుల తవ్వకానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. అరకులోయ, అనంతగరి, చింతపల్లి ప్రాంతాల లోని ఆదివాసుల బతుకులు పూర్తిగా ధ్వంసమై పోవచ్చు. ఇటువంటి అభివృద్ధి వల్ల మన సమాజంలో పరాన్న భుక్కులు ఎక్కువైపోతున్నారు. సంపద సృష్టికి నిరంతరం శ్రమించే వారికి కనీస జీవితానందం కూడా లేకపోతోంది. ఇటు వంటి ఆత్మహత్యా సదృశ అభివృద్ధివల్ల కొన్ని చిన్న దేశాలు ఇప్పుడు ఐక్యరాజ్యసమితి మీదనే పూర్తిగా ఆధారపడు తున్నాయి. మన రాష్ట్రంలో కూడా భూములను కోల్పోతున్న వివిధ సామాజిక సమూహాలు ఆహార భద్రతను కోల్పోయి ప్రభుత్వంపైనే ఆధారపడవల్సిన దుస్థితిని అనతికాలంలోనే నెదుర్కో వలసి రావడం ఖాయం.

ఈ విధ్వంసకరమైన అభివృద్ధికి లోనౌతున్నవారిలో మత్స్యకారులది మరీ దీనస్థితి. నదులు, సముద్రాలలో చేపలు పట్టుకోకుండా వారిపై ఎన్నో ఆంక్షలు విధిస్తున్నారు. ఇది వారి జీవనాధారాలను దెబ్బతీయడం కాక మరేమిటి? అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు తమను దగా చేస్తున్నాయ న్న వాస్తవాన్ని గుర్తించిన పేద ప్రజలు చైతన్య వంతులవుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. వారికి బాసటగా నిలబడటం విద్యావంతుల నైతికకర్త్యవం. సంపద సృష్టించే శ్రమ జీవుల పక్షాన నిలబడక పోతే అనతికాలంలోనే తమనూ అనేక సమస్యలు చుట్టు ముడతా యన్న నిజాన్ని విద్యావంతులందరూ గుర్తించాలి.

ప్రభుత్వం వారి బంధుగణం, కాంట్రాక్టర్లు, కార్పోరేట్‌ సంస్థలు సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా అంతా ఏకం కావాలి.భూములు, అడవులు, నదీజలాలు, సముద్రాలు, సాంస్క­ృతిక వారసత్వాల దోపిడీని అరికట్టడానికి తక్షణమే దృఢ సంకల్పంతో పూనుకోవల్సిన సమయమాసన్నమయింది.నిర్వాసితులందరూ క వేదికపైకి వచ్చి, తమ అనుభవాలను పంచుకోవాలి. తమ బాధలను పంచుకోవాలి. పరస్పర సహకారంతో ఐక్యంగా పోరాటాలు సాగించాలి.

(నేడు హైదరాబాద్‌లో భూ నిర్వాసితుల పోరాట ఐక్య సంఘటన సదస్సు ప్రారంభమవుతున్న సందర్భంగా)

Advertisements

Written by JayaPrakash Telangana

December 27, 2008 at 1:24 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: