Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

సెజ్‌లకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు

leave a comment »

 భూనిర్వాసితుల పోరాట ఐక్య సంఘటన తీర్మానం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సెజ్‌ చట్టానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయాలని భూనిర్వాసితుల పోరాట ఐక్య సంఘటన తీర్మానించింది. సెజ్‌ల కారణంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ప్రభుత్వం వెంటనే సెజ్‌ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. ప్రైవేటీకరణ, కార్పొరేట్‌ ఎన్జీవోలు, మైక్రో సంస్థలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించింది.ఓడరేవుల కారణంగా 80లక్షల మంది మత్స్యకారులు జీవనాధారాన్ని కోల్పోతున్నారని తెలిపింది. భూనిర్వాసితుల పోరాట ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండురోజుల సదస్సు ముగింపు కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. సహజ వనరులపై హక్కులు కోల్పోయి నిరాశ్రయులైన కోటి మంది నిర్వాసితుల పక్షాన ఉద్యమించే సంఘాలతో కలిసి పనిచేయాలని సమావేశంలో తీర్మానించారు. నిర్వాసితులను సమన్వయపరిచి, ఒకరి పోరాటానికి మరొకరు సంఘీభావం తెలుపుకునేలా కృషి చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర నాయకుడు నలమాస కృష్ణ, కోస్తా కారిడార్‌ వ్యతిరేక పోరాట సంఘ నాయకులు రత్నం, తెలంగాణ విద్యావంతుల వేదిక కన్వీనర్‌ పి.మద్దిలేటి, పీపుల్స్‌ డెమెక్రాటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా నాయకురాలు ఉదయ, రత్నమాల, సూరేపల్లి సుజాత, మధుకాగుల తదితరులు పాల్గొన్నారు. ‘భూముల్లేవ్‌.. ఇళ్లుల్లేవ్‌.. పూరిగుడిసెలే. ఆపదలొచ్చినా.. ఇబ్బందులు వచ్చినా 12 కిలోమీటర్లు నదిలోనే నడవాలి. మాకు భూములు కావాలని అడుగుతున్నాం.. భూముల్లో పంటలు వేస్తున్నామని అధికారులు పుస్తకాల్లో రాసుకున్నారు.. పట్టాలు మాత్రం ఇవ్వలేదు.. హీనంగా బతుకుతున్నాం.. ఒకసారి మా బతుకులు చూడండి’ అంటూ కొల్లాపూర్‌కు చెందిన గుండెపెంట నివాసి లింగమ్మ తెలిపింది.

Courtesy: Eenadu 28th Dec 2008

Advertisements

Written by dilkibaatein

December 29, 2008 at 9:55 am

Posted in News Archive, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: