Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

మా భూముల జోలికి రావొద్దు

leave a comment »

– భూ నిర్వాసితుల పోరాట ఐక్య సంఘటన

హైదరాబాద్‌, డిసెంబర్‌ 27(ఆన్‌లైన్‌): “ప్రాజెక్టులొద్దు..ఉద్యోగాలొద్ద్దూ..ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు మాకు లేవని తెలుసు.. మా భూముల జోలికి రావద్దు… మమ్మల్నొగ్గేయండి” అంటూ బాక్సైట్‌ తవ్వకాల కారణంగా భూములు కోల్పోతున్న విజయనగరం జిల్లా రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం నల్లకుంటలోని రాజశ్రీ గార్డెన్స్‌లో భూ నిర్వాసితుల పోరాట ఐక్య సంఘటన సదస్సు ప్రారంభమైంది.

సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మానవహక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కె.బాలగోపాల్‌ మాట్లాడుతూ.. గతంలోనూ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు కట్టారని, రోడ్లు వేశారని, కానీ అప్పుడు ప్రజల నుంచి రాని వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు వ్యక్తమవుతుందో అంతా గ్రహించాలన్నారు. కొద్దిమంది ప్రయోజనాన్ని దేశ ప్రయోజనంగా పేర్కొంటున్నప్పుడు కొద్దిమందికి జరుగుతున్న నష్టం కూడా దేశానికి నష్టమేనని స్పష్టం చేశారు.

దేశంలో ఎక్కడా లేని 500 అడుగుల రోడ్డు హైదరాబాద్‌లోనే ఎందుకని, లక్షలాది ఎకరాల్లో సెజ్‌లు ఎందుకని వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు దొరకటం లేదన్నారు. ఓపెన్‌కాస్ట్‌ తవ్వకాల వ్యతిరేక కమిటీ సభ్యుడు జగన్మోహనరావు మాట్లాడుతూ సింగరేణి బొగ్గు కోసం ఓపెన్‌కాస్ట్‌ తవ్వకాలు చేపట్టటం వల్ల నాలుగు తెలంగాణ జిల్లాల్లో 400 గ్రామాలు అదృశ్యం కానున్నాయన్నారు.

ఈ తవ్వకాలకు అనుమతులు తప్పనిసరని, ప్రభుత్వం వద్ద అవి ఉన్నాయోలేవో కూడా తెలియదన్నారు. బాక్సైట్‌ తవ్వకాల వ్యతిరేక కమిటీ సభ్యురాలు కాకి దేముడమ్మ మాట్లాడుతూ లోకం తెలియని తమకు ఉద్యమాలు నేర్పింది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. తమ పొలాల కోసం ఇప్పుడు పోరాడుతున్నామని ఆమె చెప్పింది. ఈ సమావేశంలో ఐక్య సంఘటన సభ్యులు సూరేపల్లి సుజాత, మధుకాగుల, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్‌ పాశం యాదగిరి అధ్యక్షత వహించారు. కిల్లె సురేంద్ర, అన్వర్‌, చిక్కుడు ప్రభాకర్‌ తదితరులు ప్రసంగించారు.

(Courtesy: AndhraJyothy)

Advertisements

Written by JayaPrakash Telangana

December 31, 2008 at 7:53 pm

Posted in AndhraJyothy, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: