Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పోలేపల్లిలో మళ్లీ లొల్లి

leave a comment »

ఏపీఐఐసీ డబ్బులతో అభివృద్ధి పనులు | అడ్డుకున్న బాధిత రైతులు

జడ్చర్లగ్రామీణం, న్యూస్‌టుడే: భూములు కోల్పోయి వీధిన పడ్డ సెజ్‌ బాధితుల కోసం ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా కోటి 15 లక్షలను కేటాయించింది. వీటితో పోలేపల్లిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్ణయించగా బాధితులు వ్యతిరేకించారు. మంగళవారం తహసిల్దార్‌ క్రిష్ణస్వామి పనులపై అభిప్రాయాలను సేకరించగా రైతులు తిరగబడ్డారు. తమకు అభివృద్ధి అవసరం లేదని, అవే డబ్బులతో ఇళ్లు నిర్మించాలని, లేదా ఆ డబ్బును సెజ్‌ బాధిత రైతులకే పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదే విషయాన్ని జిల్లా అధికారులకు వివరించనున్నట్లు తహసిల్దార్‌ క్రిష్ణస్వామి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఏపీఐఐసీ నిధులతో కాక ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రైతుల సంక్షేమం కొరకు వచ్చిన నిధులను గ్రామానికి వెచ్చించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పంచాయతీ కార్యాలయంలో తహసిల్దార్‌తో పాటు గ్రామ సర్పంచి బాలస్వామిగౌడ్‌ ఎదుట రైతులు తమ గోడును వినిపించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన దిమ్మెలను ఆగ్రహంతో కొందరు బాధితులు కూలగొట్టారు. రైతులకే పనులు ఇవ్వాలని కలెక్టర్‌ చెప్పగా కాంగ్రెస్‌ నాయకులకు అప్పజెప్పడమేమిటని మండిపడుతున్నారు.

* * *

పోలేపల్లిలో మళ్లీ లొల్లి

పోలే... లొల్లి

Advertisements

Written by JayaPrakash Telangana

January 7, 2009 at 6:08 pm

Posted in Eenadu, News Archive, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: