Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పోలేపల్లిలో ఎల్‌అండ్‌టీ కంపెనీ నిర్మాణాలు

with 2 comments

అడ్డుకున్న సెజ్‌ బాధితులు | టెంట్‌ కూల్చివేత, పూజా సామగ్రి దగ్ధం

జడ్చర్లగ్రామీణం, న్యూస్‌టుడే: పోలేపల్లి ఫార్మాసెజ్‌ల సమీపంలో ఎల్‌అండ్‌టీ కంపెనీ వారు నిర్మాణాలు చేపట్టేందుకు భూమిపూజ చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న సెజ్‌ బాధితులు అక్కడికి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు వచ్చిన విషయాన్ని గుర్తించి ఆ కంపెనీ ప్రతినిధులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడ వేసిన టెంటును కూల్చివేసి పూజా కార్యక్రమాలు వస్తువులను గుంతలో వేసి నిప్పంటించారు. ప్రభుత్వ తీరుపై జిల్లా యంత్రాంగంపై బాధితులు మండిపడ్డారు. ఈ సందర్భంగా సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన కన్వీనర్‌ మధుకాగుల మాట్లాడారు. సేకరించిన భూముల, రైతుల సమస్య పరిష్కారం కాకముందే ఫార్మాసెజ్‌లకు ప్రభుత్వం భూములు అప్పగించిందని ఆరోపించారు. తాజాగా మరికొన్ని పారిశ్రామిక కేంద్రాల కోసం మోసపూరిత మాటలతో ప్రభుత్వం భూములు కేటాయిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో కొత్తగా పరిశ్రమల కోసం నిర్మాణాలు చేపడితే సహించేది లేదని ముందుగా బాధితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ మాటలతో పారిశ్రామిక వేతలు పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని సూచించారు.

అభివృద్ధి (నిర్మాణం) పనులను వ్యతిరేకిస్తూ ధర్నా
పోలేపల్లి గ్రామంలో రూ. కోటి 15 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి (నిర్మాణం) పనులకు వ్యతిరేకిస్తూ ఈనెల 25న పోలేపల్లి సెజ్‌ బాధితుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మధుకాగుల ప్రకటించారు. కార్యక్రమంలో సెజ్‌ బాధితులు సీనయ్య, ఎట్టి లింగయ్య, కుర్మయ్య, జంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

NOTE: ప్రజాభీష్టానికి, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగ జరుగుతున్న నిర్మాణాలు అభివృద్ధి కాదు కాబట్టే పోలెపల్లి బాధితులు ‘ఎల్‌అండ్‌టీ కంపెనీ నిర్మాణాలు’ వ్యతిరేకిస్తున్నారు,  అందుకే పైన వచ్చిన వార్తలో  ‘అభివృద్ధి‘ అన్న పదాన్ని కొట్టేసి ‘నిర్మాణం‘ అన్న పదం చేర్చడమైంది.

Advertisements

Written by JayaPrakash Telangana

January 22, 2009 at 5:54 pm

Posted in Eenadu, Telugu

Tagged with , ,

2 Responses

Subscribe to comments with RSS.

  1. “ప్రజాభీష్టానికి, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగ జరుగుతున్న నిర్మాణాలు అభివృద్ధి కాదు కాబట్టే పోలెపల్లి బాధితులు ‘ఎల్‌అండ్‌టీ కంపెనీ నిర్మాణాలు’ వ్యతిరేకిస్తున్నారు, అందుకే పైన వచ్చిన వార్తలో ‘అభివృద్ధి‘ అన్న పదాన్ని కొట్టేసి ‘నిర్మాణం‘ అన్న పదం చేర్చడమైంది.”
    I guess this is one way respected News Agencies manufacture dissent among the people, by implicating ‘Construction’ is ‘Development’ & who ever opposes ‘illegal Constructions’ is ‘Against Development’.

    it’s a SHAM(e) !

    JayaPrakash Telangana

    January 22, 2009 at 5:59 pm

  2. చంద్రబాబు నాయుడు లాగే రాజశేఖర రెడ్డి కూడా కార్పరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తున్నాడు.

    Marthanda

    January 22, 2009 at 7:37 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: