Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పనులను అడ్డుకున్నపోలేపల్లి సెజ్‌ బాధితులు

leave a comment »

జడ్చర్ల, ఫిబ్రవరి 4(ఆన్‌లైన్‌): ఎపిఐఐసిలో నిర్మించే ప్రహరీనిర్మాణం పనుల ను బుధవారం పోలేపల్లి సెజ్‌ బాధితులు అడ్డుకున్నారు. నిర్వాసితులకు కేటాయించిన స్మశానవాటిక స్థలంలో ప్రహరీనిర్మాణం చేపడ్తున్నారని ఆరోపిస్తూ ప నులను అడ్డుకున్నారు. నిర్మాణం పనులను ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారి నిర్వాసితులను ప్రశ్నించగా, నిర్వాసితులు, అధికారితో కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. స్మశాన వాటికకు నాలుగు ఎకరాలస్థలాన్ని కేటాయించారని మొదట గా ప్రకటించి నేడు కేవలం రెండు ఎకరాలకు పరిమితం చేయడమేంటని ఎపిఐఐసి అధికారిని నిలదీశారు.

ప్రహారీ నిర్మాణానికి గోతులు తీసి, ఫెన్సింగ్‌ కోసం రాళ్లను ఏర్పాటు చేయడంతో, ఏర్పాటు చేసిన రాళ్లను ఈ సందర్భంగా నిర్వాసితులు తొలగించారు. ఎట్టిపరిస్థితులలోను ప్రహారీ నిర్మాణం జరుపడానికి వీలులేదని నిర్వాసితులు ఖరాఖండిగా వెల్లడించారు. ఇళ్ల స్థలాలు సైతం కుంటలో కే టాయించారని, నిర్వాసితులను ఆదుకోవాల్సిన వారంతా న్యాయం అందించేం దుకు కృషి చేయడంలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుండి ఎపిఐఐసి అధికారులు వెళ్లిపోయారు.

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)

 

pict0001

pict0002

pict0003

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: