Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పోలేపల్లి ‘పోల్‌’ బాట

leave a comment »

పార్టీల మోసంపై మరోసారి తిరుగుబాటు
మహబూబ్‌నగర్‌ లోక్‌సభకు 20 మంది

పోలేపల్లి 'పోల్‌' బాట

పోలేపల్లి 'పోల్‌' బాట

మహబూబ్‌నగర్‌, మార్చి 26 (ఆన్‌లైన్‌): పోలేపల్లి బాధితులు ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్‌ పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోలేపల్లికి చెందిన 20 మంది నిర్వాసితులు పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. ఒక స మస్యపై ఇంతమంది బాధితులు ఎన్నికల బరిలోకి దిగడం జిల్లా ఎన్నికల చరిత్రలో ఇదే ప్రథమం.

జడ్చర్ల ఉప ఎన్నికల్లో పోటీచేసిన భూ నిర్వాసితులు భిక్షాటన చేసి కడుపు నింపుకుంటూ ఓట్లు అడిగారు. ఈసారి కూడా తాము అదే చేస్తామని బాధితులు చెబుతున్నారు. రాజకీయ పార్టీలన్నీ తమను మోసం చేశాయని ముఖ్యంగా అధికార పార్టీ తమను అణచివేసే ప్రయత్నం చేసిందని అందుకే మరోసారి ఎన్నికల ద్వారా కాంగ్రెస్‌ చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు.

పోలేపల్లి సెజ్‌ ఐక్య సంఘటన కన్వీనర్‌ మధు కాగుల ఆధ్వర్యంలో బాధితులు గురువారం ఎన్నికల అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్‌ పత్రాలను తీసుకున్నారు. పోటీ చేసే నిర్వాసితులలో 15 మంది ఎస్సీలు, ఇద్దరు మైనార్టీలు, ముగ్గురు బీసీలు ఉన్నారు. వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. బిక్షపోల్ల లక్ష్మమ్మ, మాల జంగిలమ్మ, కందూరి కుర్మయ్య, కందూరి జనార్దన్‌, కందూరి నర్సింలు, ఎట్టి చిన్న వెంకటయ్య, ఎట్టి చిన్న లింగయ్య, ఎట్టి శ్రీనివాసులు, గంజి నర్సింహ, ఎన్మన్‌గండ్ల పాండు, హుస్సేని సత్యమ్మ, హుసేని రంగమ్మ, కోర గౌరమ్మ, బీంపల్లి సాయన్న, సీనయ్యగౌడ్‌, రవిందర్‌గౌడ్‌, వి వెంకటేశ్‌, అబ్దుల్‌ సలాం, మొగులమ్మ, పండుగ చెన్నయ్య లు ఎన్నికల బరిలో దిగనున్నారు.

ఇందులో 9 మంది జడ్చర్ల ఉప ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన వారే. ఆరు సంవత్సరాల తమ పోరాటానికి 123 ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించడంతో తమకు న్యాయం జరుగుతుందని వారు ఆశించారు. కాని ఎన్నికల మేనిఫెస్టోలో ఏ రాజకీయ పార్టీ కూడా సెజ్‌లపై తమ విధానాన్ని ప్రకటించలేదు. ఇక రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు పోలేపల్లిని సందర్శించి సెజ్‌ బాధితుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. ప్రత్యక్ష ఆందోళనలో కూడా అధినేతలు పాల్గొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు మినహాయిస్తే మిగిలిన అన్ని పార్టీల అధినేతలు పోలేపల్లి నిర్వాసితుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. వారి కోసం ధర్నాలు నిర్వహించారు. కాని నిర్వాసితులకు ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. దీంతో బాధితులు గత ఉప ఎన్నికల్లో జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేశారు. 13 మంది అభ్యర్థులు నామినేష న్లు వేశారు. వీరంతా 13 వేల ఓట్లు సంపాదించి రికార్డు సృష్టించారు. ప్రత్యర్థుల విజయావకాశాలను తారుమారు చేశారు.

(ఆంధ్రజ్యోతి 27 మార్చ్ 2009 సౌజన్యం)

Advertisements

Written by JayaPrakash Telangana

March 27, 2009 at 11:18 pm

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: