Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

కేసీఆర్, విఠల్ రావులకు పోలేపల్లి సెగ

with one comment

polepally-elections2009మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌కు 16 మంది నిర్వాసితుల నామినేషన్‌
మా భూమి మాకు ఇవ్వాలి ఇదే వారి ప్రధాన డిమాండ్‌

(మహబూబ్‌నగర్‌ – ఆన్‌లైన్‌ ప్రతినిధి) మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈసారి పోలేపల్లి సెజ్‌ నిర్వాసితుల అంశం కూడా ప్రధాన సమస్యగా మారనున్నది. ఈ స్థానం నుంచి 16మంది సెజ్‌ బాధితులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయడం సంచలనంగా మారింది. పాలకులు, రాజకీయ పార్టీలు తమకు న్యాయం చేయనందుకు నిరసనగానే తాము ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించినట్లు బాధితులు వివరించారు.

జడ్చర్ల అసెంబ్లీ ఉప ఎన్నికలో సెజ్‌ బాధితులు 13మంది పోటీ చేసి ఊహించని విధంగా 13వేల ఓట్లు సంపాదించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి టీడీపీపై 3వేల ఓట్ల మెజార్టీతోనే విజయం సాధించారు. సెజ్‌ బాధితులు పోటీ చేయకపోయి ఉంటే ఇక్కడ తెలుగుదేశం విజయం సాధించి ఉండేది.

ప్రభుత్వం తమ సమస్యను హామీలకే పరిమితం చేసిందని రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల అధినేతలు తమ ఉద్యమానికి మద్దతు పలికి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తాము అధికారంలోకి వస్తే మీ భూములు మీకు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కాని ఏ పార్టీ మేనిఫెస్టోలో కూడా సెజ్‌ల అంశం చేరలేదు. సెజ్‌ల కోసం పంట భూములను తిరిగి ఇప్పిస్తామని ప్రకటించిన చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం మేనిఫెస్టోలో కూడా సెజ్‌ల అంశం చేర్చలేదు. దీంతో తాము తీవ్ర ఆవేదనకు గురయ్యామని బాధితులు చెబుతున్నారు.

సెజ్‌ పోరాట ఐక్య సంఘటన కన్వీనర్‌ మధు కాగుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వాసితులు పార్లమెంట్‌కు నామినేషన్లు దాఖలు చేశారు. చివరిరోజున గంగపురి రవీందర్‌గౌడ్‌, కుర్మయ్య, ఎంఎ. జబ్బార్‌, చిన్న ఎంకయ్య, దేపల్లి సాయన్న, రంగమ్మ, జంగిలమ్మ, లక్ష్మమ్మ, గజ్జి నర్సింలు, బి.వెంకటేశ్వర్లు, లింగయ్య, పాండు, సత్యమ్మ, కందూరి నర్సింలు నామినేషన్లు వేశారు. తాము బిక్షాటన చేస్తూ ఓట్లు అడుగుతామని నిర్వాసితులు చెబుతున్నారు.

ఈ పార్లమెంట్‌ స్థానం నుంచే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పోటీ చేస్తున్నారు. ఆయన కూడా సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా విఠల్‌రావు పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సెజ్‌ నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పోటీలో ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఇద్దరు అభ్యర్థులకు పోలేపల్లి సెజ్‌ బాధితులు సెగ పెట్టనున్నారు.

మా భూములు మాకివ్వాలి : జంగిలమ్మ
కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న భూములు మాకు మళ్లీ ఇవ్వాలి. భూములు తీసుకున్నప్పుడు చేసిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మమ్మల్ని మోసం చేశారు. మా గురించి అందరికి తెలిసేందుకే ఎంపీ స్థానానికి పోటీ చేశాం.

మోసం చేశారు : లక్ష్మమ్మ
బాలనాగమ్మ సినిమాలో మాయల ఫకీర్‌ మోసం చేసిన విధంగా నన్ను మోసం చేశారు. ఎంతో ఆశ పెట్టారు. భూముల్ని తీసుకున్న తర్వాత రోడ్డున పడేశారు.

ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఎంపీగా పోటీ చేస్తున్నా… పార్కు అని…పరిశ్రమలు నిర్మించారు : సీనయ్యగౌడ్‌
నా భూమి 12ఎకరాలు…వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వాడిని. ఇక్కడ మంచి పార్కు ఏర్పాటుచేస్తామని చెప్పి భూమిని తీసుకున్నారు. అందులో మీకే ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారు. తీరా అసలుకే ఎసరుగా పూర్తిగా డబ్బులే ఇవ్వలేదు. అంతే కాదు విషపూరితమైన పరిశ్రమలు నెలకొల్పారు. దీంతో తాగునీరు కలుషితమైంది. మా బతుకులు బజారున పడ్డాయి. మా బతుకులు అందరికీ అర్థం అయ్యేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నాం.

– ఆంధ్రజ్యోతి దినపత్రిక 31-03-2009

 

Advertisements

Written by dilkibaatein

March 31, 2009 at 9:54 am

One Response

Subscribe to comments with RSS.

  1. ఐదేళ్ళకి ఒక పార్టీతో పొత్తులు మార్చే కె.సి.ఆర్. పోలేపల్లి సమస్యని పరిష్కరిస్తాడా?

    Marthanda

    April 22, 2009 at 12:25 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: