Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పోలేపల్లిలో పుస్తకావిష్కరణ

with 11 comments

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: ‘నేను పోలేపల్లి పీనుగను మాట్లాడుతున్నా’ పుస్తకాన్ని విప్లవ రచయితల సంఘం నాయకులు వరవరరావు ఆవిష్కరించారు. సోమవారం జడ్చర్ల మండలం పోలేపల్లిలో సెజ్‌ బాధిత రైతులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో పోలేపల్లి బాధితుల కథనాలు ఉన్నాయి. కార్యక్రమంలో గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మొదటిసారిగా పోలేపల్లిని సందర్శించిన వరవరరావు గ్రామంలో పర్యటించి బాధితులతో మాట్లాడారు.

ఈనాడు దినపత్రిక (14 ఏప్రిల్ 2009)

Advertisements

Written by dilkibaatein

April 15, 2009 at 8:55 am

11 Responses

Subscribe to comments with RSS.

 1. Dear REVELUTIONARI WRITERS Please don’t talk behave corpse ( Viplava Rachayathalaara Peenegallaga Pravarthinchkandi)

  Book released on 13 April2009 in Pole ally is an insult to the struggle of people. When People are struggling, fighting and speaking where is the need to make the CORPSE to SPEAK. CORPSES do speak in clandestine wars but Pole ally struggle is an OPEN PEOLES STRUGGLE requesting attention of larger audience.
  It is said to be a fiction of revolutionary tenor published by Famous Viplva Rachayithala Sangham( Revolutionary Writers Organistion of AndhraPradesh ). But In fact It can be described as work of ABSURD REVOLUTIONERY FICTION. ( VIKRUTHA VIPLAVA KAALPANIKATHA ).Polepally Struggle deserves more nuanced, careful, research and writing which helps the struggle to move forward.
  Viplva Rachayithala Sangham( Revolutionary Writers Organistion- Virasam ) pleads Immersion and commitment (Nimagnatha and Nibadhata) for social transformatory struggles. But creator of this factious writing seems to be neither immersed nor committed to the cause of struggling people of polepally. Better she stops writing some re absurd fiction in future. It is a strain on the purse of the people who buy it, pain to the people who are there in the struggle, further it is a spurious drain of a sick brain which can only speak with the dead or about deaths alone. It spoiled precious paper.
  Let hope and wish the fighting soles with burning hearts from polepally will soon come out with the History not just story – their own factual struggling life which is stranger than fiction.

  narayana

  April 22, 2009 at 7:09 pm

 2. పోలేపల్లి గురించిన వాస్తవాలు అక్కది రైతులకు తెలుసు….వాళ్ళ ద్వార సమాచారాన్ని ఇక్కడ ఉంచుతున్న మీకు తెలుసు….కాని మరి అజ్ఞానం వల్లనో లేక తమకు అనుకూలంగా విషయాలను మలచుకోవాలనే ధొరణుల వల్లనో కొందరు రాసే కథలు నేల విడిచి సాము చేస్తాయి…..చివరకు అవి కాల్పనిక కథలు గా మొదలై …అభూత కల్పనలు గా ముగుస్తాయి….

  kjaanu

  April 23, 2009 at 7:29 am

 3. మిత్రులకు ఒక విజ్ఞప్తి:

  విప్లవ రచయితల సంఘం (విరసం) పోలేపల్లి బాధిత రైతులకు సంఘీభావంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. సంఘ సభ్యులు అనేకులు పోలేపల్లి సెజ్ ను సందర్శించి బాధిత రైతాంగం దుస్థితిని గురించి వివిధ పత్రికల్లో రాశారు. గత యేడాది హైదరాబాద్ లో “పోలేపల్లి బాధితులతో కలిసి నడుద్దాం” అనే పేరిట ఒక సభను కూడా విరసం నిర్వహించింది.

  డాక్టర్ గీతాంజలి గారు రాసిన “నేను పోలేపల్లి పీనుగను మాట్లాడుతున్న…’ అనే పుస్తకాన్ని నేను చదివాను. అందులో ఈ ఉద్యమం గురించి ఎటువంటి నెగెటివ్ ఆలోచనలూ లేవు. బహుశా మిత్రులు ఆ పుస్తకం శీర్శికను చూసి పొరబడి ఉంటారు.

  విరసం రాజకీయ అభిప్రాయాలతో మనకు ఏకీభావం ఉండకపోవచ్చును కానీ, పోలేపల్లి రైతులకు వెన్నుదన్నుగా నిలబడిన అనేక ప్రజాసంఘాల్లో విరసం చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించింది అని మిత్రులు గుర్తుంచుకోవాలి.

  కొణతం దిలీప్

  Konatham Dileep

  April 30, 2009 at 4:35 pm

 4. దిలీప్ గారు నమస్తే,

  నేను పోలెపల్లి……..మాట్లాడుతున్న పుస్తకం అట్టనూ పేరునూ
  మాత్రమే కాక పుస్తకం ఆసాతము చదివిన.

  ఆ కథల్లొ చాల అభూత కల్పనలు ఉన్నై . పొలేపల్లి కీ నల్లమల కూ ఎమిటీ సంబంధం ?
  భాష సంకర వొంకర ,
  చివరికి కుందెలు వేట ఎట్ల చేస్తరొ కూడ తెల్వదామెకు .
  నిజానికి పొలేపల్లి సర్పంచి ఆ పుక్కిటి కథొలో రాసినట్టి వాడు కాదు. వొకవేళ అతదు ఆ పుస్తకం చదివితె చాన నొచ్చుకునే స్థితి .ఇట్ల రాస్తూ పోతే చానాఉంది.

  ఇటువంటి పుస్తకం ఆవిష్కరించడం అందునా పోలేపల్లె లో ఆవిష్కరించడం మంచిగాలేదు. ఈ పని విరసం చేసినా ఇంకొకరుచేసినా చెడ్డదే. నాకు విరసం అంతే ప్రత్యేక ప్రేమ గాని ద్వేశం గనీ లేవు. గీతాంజలి నాకు పాలామె గాదు పగామె కాదు.

  ఆ పుస్తకనికి మీరిచ్చిన కితాబుకు నిరసనగా మూడు ఛందోబద్ఢ అ పద్యాలు మీకు

  మత్తేభము > భ్రమలే లేవు దిలీప నాకు మదిలో బాధెంతొకల్గేను గా
  శ్రమతో శౌర్యముతోనపూర్వమగునాచైతన్యమౌ పల్లెపై
  భ్రమగల్పించెడు గీత రాతలనుఓ భెషంచుటేలాదగున్?
  క్రమమేదప్పిన వక్రమార్గుల పయిన్ క్రొడాను ఝాడింతునే

  కందం> పెట్టిన పేరుల మరియును
  అట్టలమీదున్న కొలది అచ్చులజూసీ
  ఒట్టిగ మాటలనాడము
  పొట్టుకు గింజకు తేడా పోల్చు దిలీపా.

  కందం> మొక్కెదనీకు దిలీపా
  చక్కని అనువాదరచన చేసినవాడా
  మిక్కిలిమనసే కుమిలెను
  తిక్కనిరాతలను పొగుడుతూరాయగనే

  polepalli Nayanaavadhani

  May 1, 2009 at 2:10 pm

 5. శ్రి అయ్యంగార్ పురుగు మందుల దుకాణం” అనే పేరు చూసి అక్కడకు వెళ్ళి అన్నం దొరుకుతుందా అని అడగ గలమా….
  అవాస్తవాలు ఉన్నాయి అని చెబుతున్నారు అంటే ….ఆధారాలతోనే కదా మాట్లాడేది……ఇక్కడ సంస్థలనో, వ్యక్తులనో కించపరిచే ఉద్దేశ్యం ఎందుకు వస్తుంది….కాని పేర్లు చూసి …వాళ్ళు చెప్పే ప్రతి మాటను సమర్థించలేం కదా…..అలా చేసి లేదా చేపించుకొని ….ఎక్కడొ ఆగిపొయిన వాళ్ళను మనం చూడటం లేదా…..మనం ఏవైతే వ్యతిరేకిస్తామో…దురదృష్ట వశాత్తు….మనమే వాటిని ఎక్కువగా ఆచరించే వాళ్ళు గా మారిపోయాం…. ఫలితం…తేడా గుర్తుపట్ట లేకుండా ఉన్నారు ప్రజలు ఈ రోజు….

  kjaanu

  May 2, 2009 at 7:42 am

 6. పేరు లేని మిత్రమా,

  నేను మీ లాగా సాహిత్య విమర్శకుడను కాదు. మీలా ఛందోబద్ధమైన పద్యాలూ రాయలేను. కాబట్టి మమూలు భాషలోనే నా జవాబు చెప్తాను. డాక్టర్ గీతాంజలి రాసిన పుస్తకంపై మీకుండాల్సిన అభిప్రాయం మీకు ఉండొచ్చు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఆ పుస్తకం వ్యాసాల సంకలనం కాదు. అది ఒక కథల పుస్తకం. రచయిత్రి పోలేపల్లి సెజ్ ను నేపధ్యంగా తీసుకుని కొన్ని కథలు రాశారు. కాల్పనిక సాహిత్యంలో అన్నీ వాస్తవాలే ఉండాలని రూలేమీ ఉండదని మీబోటి వారికి చెప్పాల్సిన పనిలేదనుకుంటాను. ఆ కథలు బాగున్నాయో లేవో చెప్పి ఊరుకుంటే బాగుంటుంది కానీ రచయిత్రికీ, విరసం కు లేని ఉద్దేశ్యాలు అంటగట్టి, అనవసరంగా వివాదంలోకి లాగడం సబబు కాదు.

  నా ఉద్దేశ్యంలో మీరూ, డాక్టర్ గీతాంజలి, విరసం అందరూ పోలేపల్లి ఉద్యమానికి మిత్రులే. ఈ చిన్న చిన్న బేధాభిప్రాయాలు పక్కనపెట్టి అందరం ఒక్కతాటిపై నిలబడితేనే ఈ ఉద్యమం సఫలమవుతుంది.

  అన్నట్టు చెప్పడం మరిచాను. వర్డ్ ప్రెస్ బ్లాగుల్లో వ్యాఖ్యలు రాసినప్పుడు మీ కంప్యూటర్ ఐపి అడ్రస్ నమోదవుతుంది. మీరు ఇదివరకు కూడా ఈ బ్లాగుపై వ్యాఖ్యలు రాశారు కాబట్టి మీరు ఎవరో నాకు తెలుసు. ఇటువంటి వ్యాఖ్యలు రాసేటప్పుడు మీ పేరుతో రాస్తే హుందాగా ఉంటుంది.

  Note: మీ పద్యాలు చాలా బాగున్నాయి…

  కొణతం దిలీప్

  Konatham Dileep

  May 5, 2009 at 10:45 am

 7. మిత్రమా దిలీప్,

  నాకు మీఅంత ఇంఫర్మేషన్ టెక్నాలజీ తెలియకపోయినా ఇంటెర్నెట్ వ్యవహారం రహస్యం కాదు అన్న విశయం తెలుసు

  నెనెవరొ మీకు తెలిసిపోయినదుకు సంతొషం, అది మీరు నాతో చ్చెప్పకుండా ఉంది వుంటె బాగుండేది .
  నా అభిప్రాయాలు ఆ కథల వస్తు శిల్పాల గురించే.విరసం పట్ల గానీ ,రచయిత్రి పట్లగాని ప్రత్యేక అభిమనమో ,తిరస్కారమో చూపడం నాకవసరం లేదు.ఆ పుస్తకం ఆమె రాయడం దాన్ని ఆ సంస్థ ప్రచురించడం వల్ల మాత్రమే విరసమూ, గీతాంజలీ ప్రస్తావించబడినారు.
  సంస్థనూ రచయిత్రినీ బేరీజు వేయలన్న ఉద్దేశ్యం లెదు నాకు. దానికి ఈ బ్లాగు స్థలమూ కాదు సందర్భమూ కాదు.

  ఆ కథలు చదివి,బాధ, కాసింత కొపమూ వ్యక్తం చెసిన పోలెపల్లి ప్రజలతో కూర్చుని పుస్తకం మరొసారి చదివి ఇవి రాసాను .
  ప్ర్యత్యక్షం గా పేరు రాయడం అనవసరం అని నేను అనుకున్నాను అంతే కాని ఎదో తెలియని రహస్యనందాన్ని అనుభవించాలని కాదు.
  బ్లాగు నిర్వాహకులుగా మీకు సంపాదకతా స్వేఛ్చ ఉందికదా దాన్ని మీరు నిర్మొహమాటంగా వాడుకోండి ఆవేశకావెశాలు దొర్లితే కత్తెర వేయండి.ఒకవేళ వ్యక్తిగతంగా సూచన చెయదలిస్తె అది కూదా మీరు చెయ్యొచ్చు
  ఆపుస్తకం మీద చర్చను నావైపు నుండి ఈ పద్యం తో ముగిస్తున్నాను.

  శార్దూలము> పోలేపల్లిన పోరుచున్న జనముల్ పొత్తంబునే జూచియా
  చాలారీతులనా కథారచనమున్ ఛీ..ఛీ యనంచుండగా
  నేలా మౌనము నేవహింతునని పో నెత్తాను ఘంటంబిదే
  చాలో చాలిక చౌటపర్రపయి చర్చేలాగు చెయందగున్

  సందర్భం వొచ్చిన ప్రతిసారి నరయణావధాని రాస్తూనే ఉంటాదు.

  అందరమూ నిర్మాణాత్మకంగా పొలెపాల్లి పోరాటానికి సహకరిద్దాము.
  కయీ న కయీ—- కభీ న కభీ—-ఫుర్సత్సె మిలేంగె
  తబ్ తక్ ఖుదా హాఫిజ్

  సూచన : పొలేపల్లి మీద విరసం తెచ్చిన మొదటి పుస్తకం ఈ బ్లాగు లో పెడితె బాగుంటుందెమొ అలొచించండి/ లేదా దాన్ని గురించి రాయండి, ఆ పుస్తకం ఎక్కద దొరుకుతుందో తెలుపండి. రెండవదైన ఈ కథలకైతే అంత యొగ్యత లేదు .

  polepalli Nayanaavadhani

  May 7, 2009 at 12:58 pm

 8. మనకు ఇష్టమైన మనుషులు,సంస్థలు ఎల్లప్పుడూ ఫ్లా లెస్ గా వుండాలని కోరుకోవడం వరకు బాగుంటుంది.

  కానీ కొరికలు ఎల్లవేళలా ఫలించాలనే నియమం లేదు

  మనకు ఇష్టం ఉన్నందుకు , ఆ సంస్థల, వ్యక్తుల, పూర్వ చరిత్ర గొప్పదైననదుకు సదరు నిర్వాహకుల పనులన్నీ ప్రశ్నలకూ ,విమర్శలకూ అతీతమని భావిస్తే — దాన్ని గుడ్డి దురభిమానం అంటారు— దీని లో అహంకారపు ఛాయలూ ఉంటాయి.

  వెరసి ఈ స్థితిని సైకొఫన్సీ గా మారుతుంది

  చరిత్రలో ఈ స్థితి చేసిన కీడు అపరిమితం

  విషయం అర్థమైందనుకుటాను

  ప్రస్తుతానికి సెలవు

  polpalli Narayanaavadhaani

  May 7, 2009 at 8:49 pm

 9. మిత్రమా,

  నా జవాబులోనే నేను పోలేపల్లి గురించి, ఇంకా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వస్తున్న సెజ్ ల గురించీ కొన్ని నెలల క్రితం విరసం ప్రచురించిన “ప్రత్యేక మృత్యు మండలాలు” అనే పుస్తకం గురించి ప్రస్తావిద్దామనుకున్నాను. కానీ పోలేపల్లి బ్లాగులో మనం ఇలా పుస్తకాల గురించి చర్చించుకుంటూ పోవడం అవసరమా అని ఆగిపోయాను. మీరు మొదలు ఆ పుస్తకం చదివి ఉంటే ఇప్పుడు ఇంత ఆవేశపడకపోదురు అని నాకు అనిపించింది.

  ఇప్పుడు మీరే ప్రస్తావించారు కాబట్టి ఆ పుస్తకం గురించి కొన్ని వివరాలు: పుస్తకం చిక్కడపల్లిలోని దిశ పుస్తక కేంద్రంలో దొరుకుతుంది. ఈ పుస్తకం లో పోలేపల్లి గురించి ఉన్న వ్యాసాలు బ్లాగులో పెట్టాలని మిత్రుడు జయ ప్రకాష్ (జే.పి) ఇదివరకు ఒకసారి ప్రయత్నించాడు. మరో సారి ఆ విషయం కదిలించి చూస్తాను.

  కొణతం దిలీప్

  Konatham Dileep

  May 11, 2009 at 9:58 am

 10. Dear Dileep ,
  Regards
  An enraged emotional state of mind is many a time temporary. Now it is time for improving this space. Let this space be more bilingual (now it is more of Telugu pace). This will help us to send the blog ID as reference to both Telugus and Non Telugoos across the globe.
  With respects
  Yours
  Polepalli narayanaavadhani

  polepalli Nayanaavadhani

  May 11, 2009 at 4:30 pm

 11. Dear Friend,

  Yes, we understand that most of the blog content is in Telugu. We have tried to keep as much info as possible in English too. If you notice, we have 86 posts (news & articles) under the ‘English’ category. Please click on that link to read all the content available in English.

  Thanks,

  Dileep Konatham

  Konatham Dileep

  May 12, 2009 at 9:18 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: