Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

సెజ్‌ బాధితులకు 94 వేల ఓట్లు

leave a comment »

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌, మేజర్‌న్యూస్‌: మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసిన 15 మంది సెజ్‌ బాధితులు 80వేలకు పైగా ఓట్లు సాధించడం గమనార్హం. తాము లక్ష ఓట్లు సాధిస్తామని బాధితులు మొదటినుంచి ప్రకటిస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఓట్లు రావడం విశేషం. వారిలో రవీందర్‌గౌడ్‌ అనే బాధితుడు 13,396 ఓట్లు సాధించగా, కర్రె జంగయ్య 11,268 బుడిగెజంగం లక్ష్మమ్మ 9,811, వీరితో పాటు బీఎస్పీ అభ్యర్థిగా సెజ్‌ బాధితుడైన పాలెం సుదర్శన్‌గౌడ్‌ సైతం బరిలో ఉన్నారు, ఇతడు 13,593 ఓట్లు సాధించారు. ఇవి కలిపితే సెజ్‌ బాధితులకు పోలైన ఓట్లు 94 వేలు దాటుతున్నాయి. బాధితులు రంగంలో ఉండడంతో కాంగ్రెస్‌ పార్టీ భారీ నష్టాన్ని చవి చూసిందనే చెప్పొచ్చు. వీరు రంగంలో లేకుంటే కే.సీ.ఆర్‌ గెలుపు అంత సులువయ్యేది కాదని జిల్లా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌తో పాటు దేవరకద్ర అసెంబ్లీ స్థానంలోనూ, జడ్చర్ల అసెంబ్లీలోనూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఓటమికి దారి తీసిన బాధితులు భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడంతో వారికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. తాము పోరాడుతున్న సమయంలో కాంగ్రెసేతర పార్టీలన్నీ మద్దతునిచ్చినా కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఒక్కసారైనా వారి గూర్చి ఆలోచించలేదు. దీంతో ఇక భవిష్యత్‌ ఏమిటనేది వారికి అంతు చిక్కకుండా ఉంది.

జాతీయస్థాయిలో ప్రచారం చేసుకున్నప్పటికీ సెజ్‌ సమస్య పరిష్కరించాలంటే ప్రభుత్వం సహకరించాల్సిందే. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం సెజ్‌ బాధితుల గూర్చి ఆలోచిస్తుందా లేదా అన్నది సంశయంగా మారింది. ఈ సందర్భంగా సెజ్‌ వ్యతిరేక పోరాట సమితి నాయకులు మధుకాగుల మాట్లాడుతూ తమ భవిష్యత్‌ కార్యాచరణ త్వరలోనే రూపొందిస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం ఢిల్లీకి చెందిన విశ్వనాథన్‌ అనే వ్యక్తి బాధితులను పరామర్శించి ఎన్నికల్లో ఓట్లు సాధించినందుకు అభినందనలు తెలిపి వెళ్లారు.

Advertisements

Written by Polepally InSolidarity

May 18, 2009 at 4:49 pm

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: