Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Archive for the ‘AndhraJyothy’ Category

యుద్ధం ముగియలేదు

with one comment

ప్రియమైన శాంతి కాముకులారా!
మా పసిమొగ్గల పచ్చినెత్తురుతో
శాంతిని అభిషేకించండి
Read the rest of this entry »

Written by మధు కాగుల

May 21, 2009 at 8:14 pm

Posted in AndhraJyothy, Poetry, Telugu

మరో ఆర్తగీతం

leave a comment »

– అల్లం నారాయణ

ఇప్పుడంతా జాతర. సమ్మక్క సారక్క జాతరల శివ్వాలు తూలినట్టు, ఇప్పుడు ఓ నెలరోజులు అన్ని పార్టీలూ శివ్వాలు తూలుతాయి. అటెంక మళ్లీ అయిదేండ్లదాకా.. రారెవ్వరు? గుద్దు ఇప్పుడే.. కక్షకట్టి అందరి ముఖాల మీదా ముద్దెర. మాయామోహం చూపుతున్న ముఖాల మీద…

‘కడుపున కాయో, పండో కాయకుంటే నే బాగుండు’ పండంటి పాపను కని అంగట్ల అమ్ముకోవడం ఇప్పుడు పాతబడిపోయింది. పాలసేపులు బిడ్డా. ఎవరికి చెప్పుకోను. పాలసేపుల కన్నకడుపు కోత బాధ. ఆరుస్తరా! తీరుస్తరా! పాణం బిగపడ్తది. మనసుల అగ్గిరేగుతది. Read the rest of this entry »

Written by JayaPrakash Telangana

April 4, 2009 at 7:34 pm

కేసీఆర్, విఠల్ రావులకు పోలేపల్లి సెగ

with one comment

polepally-elections2009మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌కు 16 మంది నిర్వాసితుల నామినేషన్‌
మా భూమి మాకు ఇవ్వాలి ఇదే వారి ప్రధాన డిమాండ్‌

(మహబూబ్‌నగర్‌ – ఆన్‌లైన్‌ ప్రతినిధి) మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈసారి పోలేపల్లి సెజ్‌ నిర్వాసితుల అంశం కూడా ప్రధాన సమస్యగా మారనున్నది. ఈ స్థానం నుంచి 16మంది సెజ్‌ బాధితులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయడం సంచలనంగా మారింది. పాలకులు, రాజకీయ పార్టీలు తమకు న్యాయం చేయనందుకు నిరసనగానే తాము ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించినట్లు బాధితులు వివరించారు.

Read the rest of this entry »

Written by dilkibaatein

March 31, 2009 at 9:54 am

బ్యాలెట్టే నిరసన బావుటా

with one comment

– సుజాత సూరేపల్లి

అభివృద్ధి పేరిట ప్రభుత్వం అమలు పరుస్తున్న వివిధ ప్రాజెక్టులు చట్ట విరుద్ధమైనవి. పేదల జీవనాధారాలను హరించివేయడమే కాదు పర్యావరణానికి కూడా ఎనలేని నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ప్రధాన స్రవంతి రాజకీయ పక్షాలేవీ వీటికి వ్యతిరేకంగా ఉద్యమించడం లేదు. పేదల హక్కులను కాపాడడం లేదు. ఈ పరిస్థితులలో పేదలు తమకుతామే పోరాడక తప్పదు.
Read the rest of this entry »

Written by Sujatha Surepally

March 29, 2009 at 8:42 pm

పార్లమెంట్‌కు పోలేపల్లి సెజ్‌ బాధితుని నామినేషన్‌

leave a comment »

మహబూబ్‌నగర్‌,మార్చి28(ఆన్‌లైన్‌): ముందు ప్రకటించినట్లుగానే పోలేపల్లి సెజ్‌ బాధితులు ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల కింద 20 మంది సెజ్‌ బాధితులు మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానానికి పోటీ చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా శనివారం సీనయ్యగౌడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. డాక్యుమెంట్ల వివరాలను తెలుసుకునేందుకే తాను ముందుగా నామినేషన్‌ వేశానని, మిగతా 19మంది సోమవారం దాఖలు చేస్తారని సీనయ్య తెలిపారు.

Written by JayaPrakash Telangana

March 29, 2009 at 8:39 pm

పోలేపల్లి ‘పోల్‌’ బాట

leave a comment »

పార్టీల మోసంపై మరోసారి తిరుగుబాటు
మహబూబ్‌నగర్‌ లోక్‌సభకు 20 మంది

పోలేపల్లి 'పోల్‌' బాట

పోలేపల్లి 'పోల్‌' బాట

మహబూబ్‌నగర్‌, మార్చి 26 (ఆన్‌లైన్‌): పోలేపల్లి బాధితులు ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్‌ పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోలేపల్లికి చెందిన 20 మంది నిర్వాసితులు పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. ఒక స మస్యపై ఇంతమంది బాధితులు ఎన్నికల బరిలోకి దిగడం జిల్లా ఎన్నికల చరిత్రలో ఇదే ప్రథమం.

Read the rest of this entry »

Written by JayaPrakash Telangana

March 27, 2009 at 11:18 pm

పనులను అడ్డుకున్నపోలేపల్లి సెజ్‌ బాధితులు

leave a comment »

జడ్చర్ల, ఫిబ్రవరి 4(ఆన్‌లైన్‌): ఎపిఐఐసిలో నిర్మించే ప్రహరీనిర్మాణం పనుల ను బుధవారం పోలేపల్లి సెజ్‌ బాధితులు అడ్డుకున్నారు. నిర్వాసితులకు కేటాయించిన స్మశానవాటిక స్థలంలో ప్రహరీనిర్మాణం చేపడ్తున్నారని ఆరోపిస్తూ ప నులను అడ్డుకున్నారు. Read the rest of this entry »

మా భూముల జోలికి రావొద్దు

leave a comment »

– భూ నిర్వాసితుల పోరాట ఐక్య సంఘటన

హైదరాబాద్‌, డిసెంబర్‌ 27(ఆన్‌లైన్‌): “ప్రాజెక్టులొద్దు..ఉద్యోగాలొద్ద్దూ..ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు మాకు లేవని తెలుసు.. మా భూముల జోలికి రావద్దు… మమ్మల్నొగ్గేయండి” అంటూ బాక్సైట్‌ తవ్వకాల కారణంగా భూములు కోల్పోతున్న విజయనగరం జిల్లా రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం నల్లకుంటలోని రాజశ్రీ గార్డెన్స్‌లో భూ నిర్వాసితుల పోరాట ఐక్య సంఘటన సదస్సు ప్రారంభమైంది.

సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మానవహక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కె.బాలగోపాల్‌ మాట్లాడుతూ.. గతంలోనూ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు కట్టారని, రోడ్లు వేశారని, కానీ అప్పుడు ప్రజల నుంచి రాని వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు వ్యక్తమవుతుందో అంతా గ్రహించాలన్నారు. కొద్దిమంది ప్రయోజనాన్ని దేశ ప్రయోజనంగా పేర్కొంటున్నప్పుడు కొద్దిమందికి జరుగుతున్న నష్టం కూడా దేశానికి నష్టమేనని స్పష్టం చేశారు.

Read the rest of this entry »

Written by JayaPrakash Telangana

December 31, 2008 at 7:53 pm

Posted in AndhraJyothy, Telugu

మానవతను హరిస్తున్న అభివృద్ధి

leave a comment »

– భూనిర్వాసితుల పోరాట ఐక్య సంఘటన

అభివృద్ధిపేరిట ప్రభుత్వాలు తమను దగా చేస్తున్నాయన్న వాస్తవాన్ని గుర్తించిన పేద ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. వారికి బాసటగా నిలబడటం విద్యావంతుల నైతిక కర్త్యవం. సంపద సృష్టించే శ్రమ జీవుల పక్షాన నిలబడక పోతే అనతికాలంలోనే తమనూ అనేక సమస్యలు చుట్టు ముడతాయన్న నిజాన్ని విద్యావంతులందరూ గుర్తించాలి.

అనామకులుగా మిగిలిపోయిన, అసమాన త్యాగాలు చేసి చరిత్రకెక్కని సామాన్యుల ధైర్యంతో పోల్చదగింది మరేదీ లేదు. గుర్తింపును కోరుకోకుండా, మీడియా రక్షణ భరోసా లేకుండా న్యాయం కోసం పోరాడిన వారి ధైర్యమే ధైర్యం. అది మనల్ని విన మ్రులను చేస్తుంది. ఉత్తేజ పరుస్తుంది. మానవతలో మన విశ్వాసాన్ని ప్రగాఢం చేస్తుంది.

– ఆంగ్‌ సాన్‌ సూకీ

Read the rest of this entry »

Written by JayaPrakash Telangana

December 27, 2008 at 1:24 am

మనోవేదనతో సెజ్‌ బాధితుడి మృతి

leave a comment »

జడ్చర్ల, బాలానగర్‌, నవంబర్‌20 (ఆన్‌లైన్‌): పోలేపల్లి సెజ్‌లో భూమి కోల్పోయిన ఓ రైతు మనోవేదనతో గురువారం మృతి చెందాడు. బాలానగర్‌ మండలం రాయపల్లి గ్రామానికి చెందిన పాలెం రాములుగౌడ్‌ పోలేపల్లి సెజ్‌కు భూ సేకరణలో సర్వే నంబర్‌ 420లోని ఆరు ఎకరాల 28 గుంటల భూమిని కోల్పోయాడు. Read the rest of this entry »

పోలెపల్లి సెజ్‌ బాధితులకు పాలమూరు ఎన్నారైల పరామర్శ

leave a comment »

tnri2పోలేపల్లి, నవంబర్‌ 21 : పోలేపల్లి సెజ్‌ బాధితులను ఎన్నారై ప్రతినిధులు పరామర్శించి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. విజయ్‌ చవ్వ మరియు రేణుక వెలిదన ఆధ్వర్యంలోని ఎన్నారైల బృందం పోలేపల్లి సెజ్‌ బాధితులను పరామర్శించింది. పోలేపల్లి సెజ్‌ బాధితుల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్లు సుజాత సూరేపల్లి, మధుకగుల ఎన్నారై బృందానికి దగ్గరుండి బాధితుల గోడును వినిపించారు.

Read the rest of this entry »

సెజ్‌ల రద్దులో ప్రాంతీయ వివక్ష

leave a comment »

కోస్తా కారిడార్‌కు సంబంధించిన జీఓ 34ను రద్దు చేసిన ప్రభుత్వం, పోలేపల్లి సెజ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులను మాత్రం మోసగిస్తోందని పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన కన్వీనర్‌ సూరెపల్లి సుజాత విమర్శించారు. ఆదివారం ప్రోగ్సెసివ్‌ మీడియా సెంటర్‌లో ప్రముఖ ఉద్యమ కారిణి రత్నమాల, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధి నలమాస కృష్ణ, తదితరులతో కలిసి ఆమె విలేఖరులతో మాట్లాడారు

Written by JayaPrakash Telangana

November 12, 2008 at 2:14 am

Posted in AndhraJyothy, Telugu

పోలేపల్లి బ్లాగ్ పై ఆంధ్రజ్యోతి కధనం

with 7 comments

పోలేపల్లి సెజ్ వ్యతిరేక పోరాటాన్ని ఇంటర్ నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా చేరవేస్తున్న https://polepally.wordpress.com బ్లాగ్ గురించి మొన్న ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కధనం వెలువడింది. కింద ఆ కధనం చదవచ్చు.

పోలేపల్లికి పోదాం….

Banjara

శీర్షిక చూసి, ఇదేదో పల్లెటూరుకు తీస్కెళ్లి, అక్కడి అందాల్ని వర్ణించే భావుకత నిండిన బ్లాగు అనుకుంటే పొరపాటే. సాధారణంగా బ్లాగుల్లో సరదా విషయాలు, చర్చలే ఎక్కువ శాతం చోటును ఆక్రమించుకుంటాయి. అలాంటిది, ఏకంగా ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్‌ఈజడ్‌)లపై చర్చిస్తూ ఒక బ్లాగు ఏర్పాటైందంటే నమ్మగలమా? polepally.wordpress.com మాత్రం అచ్చంగా ఓ ఎస్‌ఈజడ్‌ గురించి అవగాహన కల్పించడానికే రూపొందింది.
Read the rest of this entry »

Written by dilkibaatein

October 8, 2008 at 7:14 am

భూములెందుకు ఇచ్చేయాలి?

leave a comment »

-కె.బాలగోపాల్‌

సకల మానవ ప్రాకృతిక వనరులనూ పెట్టుబడికి దాసోహం చేయడమే పాలకుల అభివృద్ధి నమూనా. దీనికి ప్రత్యామ్నాయం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతిని ప్రజల జీవన వనరుగా గుర్తించి , వారి జీవన ప్రమాణాలను క్రమంగా మెరుగుపరిచే దిశగా వారి భాగస్వామ్యంతో దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం సాధ్యం కాదా?

Read the rest of this entry »

Written by JayaPrakash Telangana

October 8, 2008 at 2:24 am

భూమికి భూమే పరిష్కారం

leave a comment »

Madhu Kagula

Madhu Kagula

వెలుగు ప్రాజెక్టులో ఉద్యోగిగా ఉన్న మధుకాగుల ఇప్పుడు ఉద్యమకారునిగా మారిపోయారు. పోలేపల్లి సెజ్‌ బాధితుల తరపున తెలంగాణ ఐక్య సంఘటన ఏర్పాటు చేసి సాగిస్తున్న పోరాటం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. మొన్న దేవేందర్‌గౌడ్‌, నారాయణ, నిన్న బంగారు లక్ష్మణ్‌, చిరంజీవి సెజ్‌ల పోరాటానికి పోలేపల్లిని వేదికగా ఎన్నుకున్నారు. Read the rest of this entry »