Archive for the ‘Eenadu’ Category
సెజ్ బాధిత మహిళల అరెస్టు
జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: కేసు వివరాలేవి తెలుపకుండా సెజ్ బాధితులను పోలీసులు అరెస్టు చేయడంతో జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామం ఉలిక్కిపడింది. ఈ విషయంపై టీవీల్లో వార్తలు రావడంతో చర్చనీయాంశమైంది. చివరకు జడ్చర్ల కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా బెయిల్‌పై విడుదల కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Read the rest of this entry »
పోలేపల్లిలో ఎల్‌అండ్‌టీ కంపెనీ నిర్మాణాలు
అడ్డుకున్న సెజ్ బాధితులు | టెంట్ కూల్చివేత, పూజా సామగ్రి దగ్ధం
జడ్చర్లగ్రామీణం, న్యూస్‌టుడే: పోలేపల్లి ఫార్మాసెజ్‌ల సమీపంలో ఎల్‌అండ్‌టీ కంపెనీ వారు నిర్మాణాలు చేపట్టేందుకు భూమిపూజ చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న సెజ్ బాధితులు అక్కడికి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు వచ్చిన విషయాన్ని గుర్తించి ఆ కంపెనీ ప్రతినిధులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడ వేసిన టెంటును కూల్చివేసి పూజా కార్యక్రమాలు వస్తువులను గుంతలో వేసి నిప్పంటించారు. Read the rest of this entry »
పోలేపల్లిలో మళ్లీ లొల్లి
ఏపీఐఐసీ డబ్బులతో అభివృద్ధి పనులు | అడ్డుకున్న బాధిత రైతులు
జడ్చర్లగ్రామీణం, న్యూస్‌టుడే: భూములు కోల్పోయి వీధిన పడ్డ సెజ్ బాధితుల కోసం ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా కోటి 15 లక్షలను కేటాయించింది. వీటితో పోలేపల్లిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్ణయించగా బాధితులు వ్యతిరేకించారు. మంగళవారం తహసిల్దార్ క్రిష్ణస్వామి పనులపై అభిప్రాయాలను సేకరించగా రైతులు తిరగబడ్డారు. Read the rest of this entry »
బాంబుల వర్షం కురిసిన భయపడొద్దు
* ‘సెజ్’ బాధితులకు గద్దర్ బాసట * భూములిచ్చే దాక పోరాడండి
* వైఎస్, చంద్రబాబు ఒకే గూటి పక్షులు * బాధితులతో కలిసి ఆటపాట
జడ్చర్ల, న్యూస్‌టుడే: అన్నం పెట్టే రైతు కావాలో… విషాన్ని పంచే కంపెనీలు కావాలో.. రైతు రాజ్యమంటున్న వైఎస్ తేల్చుకోవాలని ప్రజా గాయకులు గద్దర్ సవాల్ విసిరారు. పోలేపల్లి బాధితులకు ఏం న్యాయం చేస్తారో సీఎం స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం పోలేపల్లి సెజ్ బాధితుల సత్యాగ్రహంలో ఆయన పాల్గొని తన మద్దతును ప్రకటించారు. Read the rest of this entry »
చిరంజీవి ప్రసంగంపై బాధితుల అసంతృప్తి
మహబూబ్‌నగర్: తమ దగ్గర నుంచి తీసుకున్న భూములకు పరిహారంగా రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని తాము ఎంతోకాలంగా పోరుతున్నామనీ, దీనిపై చిరంజీవి స్పష్టమైన హామీ ఇవ్వలేదని పోలేపల్లి సెజ్ బాధితుతులు ఈరోజు మధ్యాహ్నం నిరసనకు దిగారు. చిరంజీవి ప్రసంగాన్ని పూర్తి చేసి వెళ్లిపోయిన తర్వాత బాధితుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. చిరు ప్రసంగంలో స్పష్టత లేదనీ, తమకు ఏం చేస్తారో చెప్పలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి వెనక్కి తిరిగి వచ్చి సెజ్ బాధితుల ఐక్య సంఘటన సభ్యులతో మాట్లాడారు. ఈ సమస్యను అధ్యయనం చేసిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని చిరంజీవి వారికి హామీ ఇచ్చారు.
(Courtesy: Eenadu, 26 Sept 2008)
మీరు దగా పడ్డారు.. శుక్రవారం మీ వూరొస్తా: ‘సెజ్’ బాధితులతో చిరంజీవి
కొంత కాలం ఆగండి అన్నింటికీ పరిష్కారం
మీరు దగా పడ్డారు.. శుక్రవారం మీ వూరొస్తా
పోలేపల్లి ‘సెజ్’ బాధితులతో చిరంజీవి వ్యాఖ్య
హైదరాబాద్, న్యూస్‌టుడే: మరికొంత కాలం వేచిచూడాలని, తమ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని మహబూబ్‌నగర్ జిల్లా పోలేపల్లి ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్) బాధితులతో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. ”మీ పరిస్థితి చూస్తే హృదయవిదారకంగా ఉంది. మీ సమస్య గురించి గతంలో విన్నా. మీరు దగా పడ్డారు. ఎల్లుండి(ఈ నెల 26న) మీ గ్రామానికి వస్తా. ప్రత్యక్షంగా చూస్తా. మీకు అండగా ఉంటా. ప్రతి సమస్యకూ పరిష్కార మార్గాలు ఉన్నాయి. వాటిని అన్వేషించాలి” అని ఆయన వారితో పేర్కొన్నారు. సెజ్‌తో పోలేపల్లిలో భూములు కోల్పోయిన దాదాపు 20 కుటుంబాలవారు బుధవారమిక్కడ ప్రరాపా కార్యాలయంలో చిరంజీవిని కలిశారు. తమ పరిస్థితి గురించి దాదాపు గంటపాటు ఆయనకు వివరించారు. ప్రభుత్వం తమను భయభ్రాంతులకు గురిచేస్తూ భూములు లాక్కొన్నట్లు చెప్పారు. నష్టపరిహారం విషయంలోనూ తాము తీవ్ర అన్యాయానికి గురయ్యామని కంటతడి పెట్టుకొన్నారు. ”మాకు భూములున్నపుడు వ్యవసాయం చేసుకొంటూ బతికాం. ఇప్పుడు అప్పులపాలై పిల్లల్ని చదువులు మాన్పించి తినడానికి కూడా లేక ఇబ్బందులు పడుతున్నాం” అని ఆవేదన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా మహబూబ్‌నగర్ జిల్లా పేదలు కూలీలుగానే ఉన్నారని, ఈ నిరుపేదల పక్షాన నిలవాలని కోరారు. వారు చెప్పిందంతా విన్న తర్వాత, ”ఇప్పటివరకు ఓపిక పట్టిన మీరు మరికొంత కాలం ఉండాలి. మీ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుంది” అని చిరంజీవి భరోసా ఇచ్చారు.
(Courtesy: Eenadu 25th Sept 2008)
Press Coverage : Polepally Public Hearing
- Andhra Bhoomi Coverage
- Eenadu Coverage
- Saakshi Coverage 1
- Saakshi Coverage 2