Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Posts Tagged ‘ఎపిఐఐసి

పనులను అడ్డుకున్నపోలేపల్లి సెజ్‌ బాధితులు

leave a comment »

జడ్చర్ల, ఫిబ్రవరి 4(ఆన్‌లైన్‌): ఎపిఐఐసిలో నిర్మించే ప్రహరీనిర్మాణం పనుల ను బుధవారం పోలేపల్లి సెజ్‌ బాధితులు అడ్డుకున్నారు. నిర్వాసితులకు కేటాయించిన స్మశానవాటిక స్థలంలో ప్రహరీనిర్మాణం చేపడ్తున్నారని ఆరోపిస్తూ ప నులను అడ్డుకున్నారు. Read the rest of this entry »

సెజ్‌ భూమికి ‘కుల’మానం – అడుగులు కాదు బడుగులే

leave a comment »

మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 27, ప్రభాతవార్త ప్రతినిధి : పోలేపల్లి ఫార్మాసెజ్‌లో ప్రభుత్వం కేవలం బడుగు, బలహీనవర్గాల భూము లను మాత్రమే సేకరించింది. ఎవరు చేశారో, ఎలాచేశారో తెలియదు కాని, సెజ్‌కు చుట్టూ ఉన్న పెద్దల భూములను మా త్రం పదిలంగా ఉంచి పేదల భూములను లాగేసు కున్నారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల కు చెందిన భూములు మాత్రమే ఈ సెజ్‌లో ప్రభుత్వ పరం కాగా బతకడం కోసమే ఈ బడుగు వర్గాలు పోరాటాన్ని సాగిస్తున్నాయి. Read the rest of this entry »

పచ్చని పల్లెల్లో సెజ్‌ చిచ్చు

leave a comment »

నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని నాలుగైదు మండలాల్లో ప్రభుత్వం చేపట్టిన సెజ్‌లు పేదల జీవితాలను నామరూపాలు లేకుండా ఎలా నాశనం చేస్తున్నాయో వివరిస్తున్నారు ఘంటా చక్రపాణి

ప్రపంచీకరణ ఫలితాలు ఉహించిన దానికంటే వేగంగా ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. ఇంతకాలం చాపకింది నీళ్లలా పరోక్షంగానే నష్టం కలిగించిన ఆర్థిక సంస్కరణలు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌ల)తో నేరుగా గ్రామీణ జనజీవితాల్ని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థను ముట్టడిస్తున్నాయి. మన రాజకీయ, పరిపాలన, న్యాయ వ్యవస్థలు చేష్టలుడిగి చూస్తోంటే ఈ విధానాలను ఆసరా చేసుకొని పల్లెల్లో ప్రవేశించిన బహుళజాతి కంపెనీలు, బడా వ్యాపార సంస్థలు ఈస్టిండియా కంపెనీని తలపిస్తున్నాయి. ఇప్పుడు దేశంలోని పల్లెపల్లెనా నయా సామ్రాజ్యవాద పోకడలు ‘సెజ్‌’ల రాకతో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Read the rest of this entry »