Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Posts Tagged ‘పోలేపల్లి సెజ్

మల్లు రవీ! ఏమిటీ పనీ?

with one comment

పోలేపల్లి బాధిత రైతులకు మొన్న మల్లు రవి ఇచ్చిన ఇళ్ల పట్టాలు బోగస్ అని తేలింది. హడావిడిగా తయారు చేసిన సదరు పట్టాల్లో వంద తప్పులు ఉన్నాయి. అసలు ఏపి.ఐ.ఐ.సి. ఆధీనంలో ఉన్న భూముల పట్టాలు రెవెన్యూ శాఖ ఎలా ఇచ్చిందో అర్థం కావట్లేదు. బహుశా రెవెన్యూ వాళ్లకు కాస్త ఆలస్యంగా జ్ఞానోదయం అయ్యింది కాబోలు అందుకే పంపిణీ చేసిన పట్టాల్లో “ఏపి.ఐ.ఐ.సి ద్వారా పంపిణీ చేయబడిన…” అన్న వాక్యంలో “ఏపి.ఐ.ఐ.సి” అన్న పదాన్ని స్కెచ్ పెన్నుతో కొట్టి వేశారు.

ఇక ఇళ్ల స్థలాలు లే ఔట్ పరిశీలిస్తే దిమ్మ తిరిగిపోతుంది మనకు. ఇంత సుందరమైన లే ఔట్ ను మనం జన్మలో చూసి ఉండం.

ఆ పట్టాలు, లే ఔట్ బొమ్మలు ఇక్కడ చూసి తరించండి.

https://polepally.wordpress.com/2008/08/11/farce_land_deeds/polepally_land_deed_1/

https://polepally.wordpress.com/2008/08/11/farce_land_deeds/polepally_land_deed_2/

ఆ “పట్టా” లో రాసినదాని ప్రకారం, లబ్దిదారునికి కేవలం ఆ ఇంటిస్థలం లీజుకు ఇచ్చినట్టే. దానిని లబ్దిదారులు అమ్ముకోవడానికి కానీ, వేరొకరికి బదలాయించడానికి కానీ వీలు లేదు.

మరొక విషయం ఏమిటంటే ప్రభుత్వం రైతులకు ఎకరానికి ఇచ్చింది 18000. కాబట్టి ఇప్పుడు వారి దగ్గర లాక్కుని వారికే ఇచ్చిన ఈ 200 గజాల స్థలం విలువ కేవలం 700 రూపాయలు అవుతుంది.

మల్లు రవి & కంపెనీ చేసింది ఎంత గొప్ప సాయమో తెలుసుకుని పోలేపల్లి బాధిత రైతులు తాము మరొక సారి మోసపోయామని ఆగ్రహంతో ఊగిపోయారు.

ఇవ్వాళ జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ బోగస్ పట్టాలను కుప్పపోసి తగులబెడదామని వారు నిర్ణయించుకున్నారు.

Written by dilkibaatein

August 12, 2008 at 11:33 am

పోలేపల్లి సెజ్‌ బాధితుల అక్రమనిర్భంధం

with one comment

పోలీస్‌ జులుం
ముఖ్యమంత్రి పర్యటన కోసం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

వారంతా.. ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌) బాధితులు.. అరకొర పరిహారంతో తమ భూములను లాక్కొని.. జీవనోపాధిని దెబ్బతీసిన సర్కారుపై నిరసన గళం విప్పిన అతి సామాన్యులు. అందివచ్చిన ఉప ఎన్నికలను అస్త్రంగా చేసుకొని.. తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడానికి ఎన్నికల బరిలో దూకారు.. వినూత్న శైలిలో ఊరూవాడా ప్రచారం చేపట్టారు. ఇదే పాలకులకు కంటగింపుగా మారింది. తమ సమస్యను ముఖ్యమంత్రికి ఏకరువు పెట్టుకునేందుకు సిద్ధమైన వారిపై పోలీసు బలగాన్ని ప్రయోగించారు. వారి నిరసనపై ఉక్కుపాదం మోపారు. ఎన్నికల కోడ్‌ను దర్జాగా ఉల్లంఘించి.. అభ్యర్థులను అపహరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ఉప ఎన్నికల బరిలో నిలిచిన పోలేపల్లి సెజ్‌ బాధితులను శనివారం పోలీసులు నిర్బంధించారు. ఈ సందర్భంగా ఓ అభ్యర్థి సృహ తప్పి పడిపోయారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం సాగిన ఈ అక్రమ నిర్బంధంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read the rest of this entry »

Written by dilkibaatein

May 25, 2008 at 6:30 am

చచ్చాకా శాంతి లేదు – శ్మశానాన్ని మింగేసిన సెజ్‌

leave a comment »

అంత్యక్రియలకు భూమి కొన్నాం
నిర్వాసిత కుటుంబం ఆవేదన

జడ్చర్ల నుంచి న్యూస్‌టుడే ప్రత్యేక ప్రతినిధి

కొన్నేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పండ్ల తోటలకు జాగా కావాలంటూ పోలేపల్లిలో పాదం మోపింది. తొలి అడుగు ఆస్తుల మీద, మలి అడుగు నిర్వాసితుల బతుకుల మీద వేసింది. ఇటీవల పోలేపల్లి శివారు గుండ్లగడ్డ తండావాసి ఒకరు మరణించాక తెలిసింది. మూడో అడుగు చావు మీద పడిందని. అంత్యక్రియలకు ఆరు అడుగుల జాగా కూడా లేదని! ఉప ఎన్నికల వేడిలో ప్రస్తుతానికి చావు సమస్య పరిష్కారమైనా బతుకు సమస్య ఇంకా అలాగే ఉంది.

Read the rest of this entry »

ఉసురు తీసిన సెజ్‌!

leave a comment »

ఒకే గ్రామంలో 25 మంది బలి
సొంతభూమిలోనే కూలీలైన రైతులు
ఎదురుతిరిగినవారిపై కేసులు
జైళ్లలో కుక్కిన యంత్రాంగం
అవమానంతో ఆత్మహత్యలు
జడ్చర్ల ప్రత్యేక ఆర్థిక మండలి ప్రభావం

ఈయన పేరు బాలు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద పోలేపల్లి రైతు. 16 ఎకరాల ఆసామి. ప్రత్యేక ఆర్థిక మండలి కోసం తన భూమిని సేకరించడాన్ని ప్రశ్నించినందుకు ప్రభుత్వం ఇతడిని అరెస్టుచేసి జైలుకు పంపింది. అవమాన భారంతో కుంగిపోయి మరణించాడు. ఇతడే కాదు.. పాతిక మందికిపైగా రైతులు ఇలా భూసేకరణకు బలయ్యారు. రైతులను తమ పొలంలోనే కూలీలుగా మార్చేసి వారి బతుకులను ఛిద్రం చేసిన ఓ ప్రత్యేక ఆర్థిక మండలిపై న్యూస్‌టుడే ప్రత్యేక కథనం.

Read the rest of this entry »

Written by dilkibaatein

April 21, 2008 at 8:49 am

పంట భూముల్లో సెజ్‌ల మంట

leave a comment »

By ప్రసాదరావు

పారిశ్రామిక రంగం అభివృద్ధి జరిగితే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇప్పుడున్న పరిస్థితికి భిన్నంగా జీవనం ఉంటుందని ఊహిస్తారు. ఉద్యోగం లేక నిరుద్యోగులుగా తిరుగుతున్న యువతకు ఉద్యోగాలొస్తాయన్న ఆశ బలంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన పరిస్థితులు మెరుగు పడతాయి. కొత్త కొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయని కలలు కంటారు. తమ భూముల విలువ పెరుగుతుందని, గ్రామాలు అన్న రంగాల్లో అభివృద్ధి సాధిస్తాయని ప్రజలు భావించడంలో తప్పేమీ లేదు.

కాని రాష్ట్రంలో కాదు, దేశంలోనే పరిశ్రమల స్థాపన ఇందుకు విరుద్దంగా సాగుతున్నది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు (పారిశ్రామిక యజమానుల గుత్తాధిపత్యం) వస్తున్నాయంటే మొత్తంగా గ్రామాలు గ్రామాలే తరలిపోవాల్సి వస్తుంది. మొత్తం వారి జీవన విధానంపైనే ఈ పరిశ్రమలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గ్రామాలన్నింటిని కబళించివేస్తున్నాయి.

Read the rest of this entry »

Written by dilkibaatein

April 2, 2008 at 5:35 am