Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Posts Tagged ‘లొల్లి

నీలొల్లి నా లొల్లి సెజ్‌ల నెల్లగొట్టె లొల్లి !

leave a comment »

– గొపాల్

Gopal Singing 'నీలొల్లి నా లొల్లి సెజ్ లనెల్లగొట్టె లొల్లి !'

Gopal Singing 'నీలొల్లి నా లొల్లి సెజ్ లనెల్లగొట్టె లొల్లి !'

నీ లొల్లి నా లొల్లి సెజ్‌ల నెల్లగొట్టే లొల్లి
పొలమాక్రమించి నోన్ని
పొలిమేర దాటెల్లగొట్టు
పల్లె పల్లె లొల్లి బెట్టు || నీ లొల్లి… ||

వాన పాములు నత్త గుల్లలు
అడవి ఎలుక పిల్లలురా
మా గుట్టల మీద కుందేలు
దుంపులు ఏడ పొయెనుర
సింతమాను సిగురు మీద
ఉడుత పిల్ల గూడేది
మద్ది మాను కింద ఊరె
మంచినీటి బుగ్గేది

ఆ పల్లె అంచు జొన్న సేలో
వాలే ఊర పిట్టాలేవి || నీ లొల్లి… || Read the rest of this entry »

Advertisements

Written by JayaPrakash Telangana

August 8, 2008 at 2:29 am