Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Posts Tagged ‘హరగోపాల్‌

వైఎస్‌కు మా ఉసురు ముడ్తది

leave a comment »

జడ్చర్ల, సెప్టెంబర్‌ 28 (ఆన్‌లైన్‌) సారూ… మా భూములు పోయినయి… మా బతుకులు బజారున పడినయి… భూములు పోతే బతుకులు ఎట్లా ఉంటాయో వై.ఎస్‌కు తెలవదా?… మాది మాకు విషం చేస్తున్నాడు… మా ఉసురు వైఎస్‌కు ముడ్తది… ఇక్కడున్న కంపెనీ వాళ్ళకు కలెక్టరమ్మ అమ్ముడు పోయింది…మా ఎమ్మెల్యే దొంగ … అంటూ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ముందు పోలేపల్లి సెజ్‌ భాదితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న భూ సత్యాగ్రహ శిబిరాన్ని హరగోపాల్‌ బృందం ఆదివారం సందర్శించారు.

సెజ్‌ బాధితులకు అండగా ఉంటామని హరగోపాల్‌ ఈ సందర్భంగా హమీ ఇచ్చారు.

పత్రికారంగం మీ వెంట ఉంటుంది : ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్‌

సెజ్‌ బాధితుల న్యాయమైన పోరాటానికి పత్రికారంగం అండగా ఉంటుందని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్‌ కె శ్రీనివాస్‌ బాధితులకు భరోసా ఇచ్చారు. పోలేపల్లి రైతులకు న్యాయం జరిగేదాకా వార్తలు రాస్తూ అండగా ఉంటామని చెప్పారు.

(Courtesy: AndhraJyothy 29th Sept 2008)

ప్రభుత్వం పునరాలోచించాలి : ప్రొఫెసర్‌ హరగోపాల్‌

leave a comment »

జడ్చర్ల, సెప్టెంబర్‌ 28 (ఆన్‌లైన్‌) పోలేపల్లి అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సూచించారు. ఆదివారం పోలేపల్లి సెజ్‌ బాధితుల భూ సత్యాగ్రహ శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలేపల్లి సమస్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలని కోరారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ళపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని అన్నారు. ఆర్థిక విధానాల వల్లే గత ఎన్నికలలో చంద్రబాబు ఓడారని గుర్తు చేశారు. పార్టీల ప్రణాళికలో సెజ్‌ల అంశంపై రాసుకుని గెలవండని సూచించారు. భూములు కోల్పోయి, బతుకుభారంగా వెల్లదీ సుకుంటున్న సెజ్‌ భాదితులకు భూమికి భూమి ఇవ్వాలని కోరారు.

Read the rest of this entry »

Written by dilkibaatein

September 29, 2008 at 12:55 pm

మేల్కోకుంటే మరో నందిగ్రాం

leave a comment »

* పోలేపల్లి పోరాటం చర్చనీయాంశం | * పౌర హక్కుల నేత ప్రొ.హరగోపాల్‌

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: ‘సెజ్‌ల ఏర్పాటు విధానం దుర్మార్గమైనది. అందులో ఫార్మా సెజ్‌లు విషపూరితమైనవి. నాలుగు ఫార్మా సెజ్‌లను మూసివేయాలని ఇటీవలే సుప్రీం కోర్టు సూచించింది. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పోలేపల్లి పోరాటం దేశంలో చర్చనీయాంశంగా మారింది. మరో నందిగ్రాం, సింగూర్‌ కాకముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి’ అని పౌర హక్కుల సంఘం నేత ప్రొ.హరగోపాల్‌ సూచించారు.
Read the rest of this entry »