Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Posts Tagged ‘ఏపీఐఐసీ

రైతు పొట్టకొట్టి బుకాయింపా?

leave a comment »

రైతు సంతోషిస్తున్నాడా?
వారి పొట్టకొట్టి బుకాయింపా?
ముందస్తు సమాచారం ఏదీ
నోటిఫికేషన్లు ఎక్కడ
పునరావాస చర్యలేవీ
నీటి వనరుల్ని సేకరించట్లేదా
మంత్రులూ… వీటికి సమాధానాలు ఎక్కడ?
చిలమత్తూరు భూసేకరణలో పారదర్శకతకు పాతర

హైదరాబాద్‌ – న్యూస్‌టుడే : ప్రభుత్వం ఎక్కడైనా భూమిని సేకరిస్తూ ఉంటే… ఎందుకోసం సేకరిస్తున్నారో చెప్పడం ధర్మం. ఆ మేరకు నోటిఫికేషన్లు ఇవ్వడం, పరిహారాన్ని ప్రకటించడం, పునరావాస చర్యలు చేపట్టడం విధిగా చేయాల్సిన పనులు. కానీ అనంతపురం జిల్లా చిలమత్తూరు భూసేకరణ విషయంలో ప్రభుత్వం పారదర్శకతకు పాతరేసింది. ఎంత భూమిని సేకరిస్తుందో, ఏయే సర్వే నెంబర్లలో, ఎందుకోసం సేకరిస్తుందో ఎవరికీ చెప్పలేదు. నోటిఫికేషన్లూ ఇవ్వలేదు. Read the rest of this entry »

Written by dilkibaatein

August 26, 2008 at 9:12 am

రైతన్నకు వెన్నుపోటు

leave a comment »

 
అసైన్డ్‌ పేరిట వేల ఎకరాలు స్వాధీనం
అయిన వారికి కట్టబెట్టేందుకే!
సర్కారే భూ బకాసుర పాత్ర
పారిశ్రామిక పార్కు పేరిట దందా
తమకు దిక్కెవరంటున్న చిలమత్తూరు రైతులు
నష్టపోతున్నది దళితులే ఎక్కువ-

ఎం.ఎల్‌. నరసింహారెడ్డి
చిలమత్తూరు నుంచి న్యూస్‌టుడే ప్రత్యేక ప్రతినిధి

 

ఇది బక్క రైతుపై ఉక్కుపాదం. పారిశ్రామిక పంజా కోరల్లో చిక్కిన శ్రామికుడి ఆర్తనాదం. అభివృద్ధి ముసుగులో అన్నదాత కడుపుకొట్టే నయవంచన. ఎకరం వేటలో కనికరం మరచిన పాలక ప్రభువుల తీక్షణ వీక్షణం. ఏకంగా సర్కారే భూ బకాసుర పాత్ర పోషిస్తున్న వైనం. అసైన్డ్‌ పేరుచెప్పి, అయినవారికి వేల ఎకరాలు దోచిపెట్టే ఘరానా దోపిడీ. ఈ దోపిడీలో చిత్తుచిత్తు అవుతున్నది అనంతపురం జిల్లా చిలమత్తూరు రైతు.

Read the rest of this entry »