Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Posts Tagged ‘Jyothy

పోలేపల్లి బ్లాగ్ పై ఆంధ్రజ్యోతి కధనం

with 7 comments

పోలేపల్లి సెజ్ వ్యతిరేక పోరాటాన్ని ఇంటర్ నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా చేరవేస్తున్న https://polepally.wordpress.com బ్లాగ్ గురించి మొన్న ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కధనం వెలువడింది. కింద ఆ కధనం చదవచ్చు.

పోలేపల్లికి పోదాం….

Banjara

శీర్షిక చూసి, ఇదేదో పల్లెటూరుకు తీస్కెళ్లి, అక్కడి అందాల్ని వర్ణించే భావుకత నిండిన బ్లాగు అనుకుంటే పొరపాటే. సాధారణంగా బ్లాగుల్లో సరదా విషయాలు, చర్చలే ఎక్కువ శాతం చోటును ఆక్రమించుకుంటాయి. అలాంటిది, ఏకంగా ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్‌ఈజడ్‌)లపై చర్చిస్తూ ఒక బ్లాగు ఏర్పాటైందంటే నమ్మగలమా? polepally.wordpress.com మాత్రం అచ్చంగా ఓ ఎస్‌ఈజడ్‌ గురించి అవగాహన కల్పించడానికే రూపొందింది.
Read the rest of this entry »

Written by dilkibaatein

October 8, 2008 at 7:14 am

వైఎస్‌కు మా ఉసురు ముడ్తది

leave a comment »

జడ్చర్ల, సెప్టెంబర్‌ 28 (ఆన్‌లైన్‌) సారూ… మా భూములు పోయినయి… మా బతుకులు బజారున పడినయి… భూములు పోతే బతుకులు ఎట్లా ఉంటాయో వై.ఎస్‌కు తెలవదా?… మాది మాకు విషం చేస్తున్నాడు… మా ఉసురు వైఎస్‌కు ముడ్తది… ఇక్కడున్న కంపెనీ వాళ్ళకు కలెక్టరమ్మ అమ్ముడు పోయింది…మా ఎమ్మెల్యే దొంగ … అంటూ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ముందు పోలేపల్లి సెజ్‌ భాదితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న భూ సత్యాగ్రహ శిబిరాన్ని హరగోపాల్‌ బృందం ఆదివారం సందర్శించారు.

సెజ్‌ బాధితులకు అండగా ఉంటామని హరగోపాల్‌ ఈ సందర్భంగా హమీ ఇచ్చారు.

పత్రికారంగం మీ వెంట ఉంటుంది : ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్‌

సెజ్‌ బాధితుల న్యాయమైన పోరాటానికి పత్రికారంగం అండగా ఉంటుందని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్‌ కె శ్రీనివాస్‌ బాధితులకు భరోసా ఇచ్చారు. పోలేపల్లి రైతులకు న్యాయం జరిగేదాకా వార్తలు రాస్తూ అండగా ఉంటామని చెప్పారు.

(Courtesy: AndhraJyothy 29th Sept 2008)