Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Posts Tagged ‘Telugu

పార్టీలోల్లకి పోలేపల్లి దండాలు

with 3 comments

అయ్యలార, మీకు పేరు పేరున దండాలు!
గీనాటికైనా మీ బంగ్లాల నుంచి మా ఊరికొచ్చిండ్లు
కెమరాలనెంటేసుకొని కొంత సమయాన్నిచ్చిండ్లు
నవ్వుకుంట కలిసిమెల్సి బండ్ల మీద వొచ్చిండ్లు

Read the rest of this entry »

Advertisements

Written by Sujatha Surepally

November 7, 2008 at 1:42 am

Posted in Poetry, Telugu

Tagged with , , , ,

సెజ్‌ బాధిత రైతుల బతుకు ఘోరం – నాగబాబు

leave a comment »

సెజ్‌ బాధిత రైతుల బతుకు ఘోరం - నాగబాబు

సెజ్‌ బాధిత రైతుల బతుకు ఘోరం - నాగబాబు

బడాబాబులకు పేదల భూములు

పరిహారంతో తిరిగి పొలం కొనగలరా?
సెజ్‌ బాధిత రైతుల బతుకు ఘోరం
చావే దిక్కయ్యే పరిస్థితి
బాధితులకు మనం మద్దతివ్వాలి
నాగబాబు వ్యాఖ్యలు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్‌ల) పేరుతో పేద రైతుల భూములను బడా బాబులకు కట్టబెడుతున్నారని సినీ నటుడు చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు విమర్శించారు. ”వారిచ్చే పరిహారంతో తిరిగి పొలం కొనుక్కొనే పరిస్థితి లేదు. పని దొరక్క, ఆహారంలేక జడ్చర్ల లాంటి చోట్ల బాధితులు మరణించడమే శరణ్యమయ్యేలా ఉంది. సెజ్‌లు ఏర్పాటవుతున్న ప్రతిచోటా దారుణమే. మత్స్యకారుల బతుకు ఘోరం. ఇలాంటి బాధితులందరికీ మనం మద్దతివ్వాలి. చిరంజీవి స్పందించి, బాధ్యత తీసుకొని రాబోతున్నారు. ఆయన్ను అనుసరించే వారందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుంది” అని పేర్కొన్నారు. Read the rest of this entry »

దళారీ ప్రభుత్వమిది

with 3 comments

నయా జమీందారీ వ్యవస్థను నెలకొల్పారు
ప్రజలు గుణపాఠం చెప్పాలి
‘పోలేపల్లి’ సత్యాగ్రహంలో దేవేందర్‌ ధ్వజం
సెజ్‌ను రద్దు చేయాలని బాధితుల డిమాండ్‌

హైదరాబాద్‌ – న్యూస్‌టుడే

పేదల భూములను బలవంతంగా లాక్కుని, ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న వైఎస్‌ ప్రభుత్వం ‘నయా జమీందారీ’ వ్యవస్థను నెలకొల్పిందని మాజీ హోం మంత్రి టి.దేవేందర్‌ గౌడ్‌ విమర్శించారు. పరిశ్రమల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు సమకూర్చాల్సిన ఏపీఐఐసీ వంటి సంస్థలు దళారీ పాత్రను పోషిస్తున్నాయని ధ్వజమెత్తారు. Read the rest of this entry »

Written by dilkibaatein

July 8, 2008 at 8:40 am

Polepally Farmers protest in front of APIIC office, Hyderabad

leave a comment »

Written by JayaPrakash Telangana

July 7, 2008 at 5:33 am

ఎలుగెత్తిన పోలేపల్లి

with 2 comments

గెలుపు తారుమారు చేసిన సెజ్‌ ఓట్లు

(ఆన్‌లైన్‌, మహబూబ్‌నగర్‌) పోలేపల్లి పోరు గెలిచింది. ఎన్నికలలో విజయా లు ఎలా ఉన్నా పోలేపల్లి సెజ్‌ బాధితుల పోరాటం నెగ్గింది. బాధితులు ఓడినా సమస్యకు పరిష్కారం దొరికింది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ఉప ఎన్నికలను సెజ్‌ సమస్య కుదిపేసింది. అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. అనుకున్నట్లుగానే సమస్య గెలిచి ప్రధాన అభ్యర్థుల గెలుపును తారుమారు చేసింది. తమ జీవితాలను రోడ్డుకీడ్చిన సెజ్‌ను ఎత్తివేయాలని, తమ జీవితాలకు మేలు చేయాలని పోలేపల్లి గ్రామాలకు చెందిన సెజ్‌ బాధితులు 14 మంది జడ్చర్ల ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. పోలేపల్లి, గుండ్లగడ్డ తండాకు చెందిన 200 ఎకరాల భూమిని ఫార్మా సెజ్‌కు కేటాయించారు. దీనికి పరిహారం కూడా తక్కువ మొత్తంలోనే చెల్లించారు. గ్రోత్‌సెంటర్‌ కోసం తీసుకున్న భూమిని సెజ్‌కు కేటాయించారు.

Read the rest of this entry »

Written by dilkibaatein

June 2, 2008 at 6:35 am

పోలేపల్లి సెజ్ బాధితులకు ఓటేయండి

with one comment

మే 29 నాడు జరగనున్న జడ్చర్ల ఉప ఎన్నికల్లో 13 మంది సెజ్ బాధిత రైతులు పోటీకి నిలబడ్డారు. తమకు జరిగిన అన్యాయం బయటి ప్రపంచానికి చాటడానికి, అన్ని రాజకీయ పార్టీలూ తమను ఎలా మోసం చేశాయో వెల్లడించడానికే ఆ రైతులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

కింది కరపత్రంలో అభ్యర్ధుల వివరాలు, వారి గుర్తులు ఉన్నాయి.

Written by dilkibaatein

May 21, 2008 at 4:01 am