Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Posts Tagged ‘Veekshanam

ప్రత్యేక ఆర్థిక మండలాలు – మహిళలపై ప్రభావం

with one comment

సెజ్‌ల వల్లత భూములు కోల్పోయిన రైతుల కష్టాలను, ఈ పరిణామాలతో మరిన్ని అవస్థల పాలవుతున్న స్త్రీల పరిస్థితిని వివరిస్తున్నారు సాదు రాజేష్‌

అభివృద్ధి ఎలా ఉంటుంది? అభివృద్ధి ఫలాలు ఎవరు అందుకోవాలి? అభివృద్ధి అవసరం ఎవరికి కావాలి? అభివృద్ధిని ఎలా సాధించాలి? ఈ ప్రశ్నలకు నేడు మన ప్రభుత్వాల నూతన అభివృద్ధి సంస్కరణల విధానం స్పష్టంగా తెలియజేస్తోంది. అభివృద్ధి అంటే పచ్చని పంటలతో తులతూగే పల్లె సీమలను విస్తాపనం చేసి వాటి స్థానంలో ధగధగ కాంతులతో మెరిసే హోటల్స్‌ను, సినిమాహాళ్లను, టౌన్‌షిప్‌లను, హబ్‌లను, పబ్‌లను నిర్మించి కొంతమంది ధనికులకు ఆనంద నిలయాలను తయారు చేయడమే అభివృద్ధిగా చెప్పడం జరుగుతోంది. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

September 11, 2008 at 9:38 pm

చెబుతున్నదేమిటి – చేస్తున్నదేమిటి?

leave a comment »

జెండాలు ఏవైనా, ఎజెండా ఏది ప్రకటించినా సామ్రాజ్యవాదులను సంతృప్తి పరచడంలో పాలక, ప్రతిపక్ష పార్టీలన్నింటి విధానం ఒకటేనని అంటున్నారు ఎం. రత్నమాల

అక్షరక్రమంలో రెండో స్థానంలోనే కాదు ప్రత్యేక ఆర్థిక మండళ్లు నెలకొల్పడంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు కలిపి 446 సెజ్‌లు ఇప్పటికి ఏర్పాటు కానుండగా మన రాష్ట్రం 76 సెజ్‌లను అనుమతించుకుని దేశంలో రెండో స్థానంలో ఉంది. 88 సెజ్‌ల మహారాష్ట్రను కూడా మించడానికి ఆంధ్రప్రదేశ్‌ ఇటీవల రాష్ట్ర సముద్రతీరం పొడుగునా కోస్టల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ నిర్మాణంతో పాటు మరో పన్నెండు ప్రత్యేక ఆర్థిక మండలాలు (స్పెషల్‌ ఎకానామిక్‌ జోన్స్‌ అనే సెజ్‌లు పొడి అక్షరాల్లో ఎస్‌.ఇ.జెడ్‌ లు) రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటయిన 54 ప్రత్యేక ఆర్థిక మండలాల్లో (సెజ్‌ల్లో) 27 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఆశ చూపుతున్నారు. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

July 1, 2008 at 2:58 am

దారితప్పిన ప్రత్యేక ఆర్థిక మండలాలు

leave a comment »

సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే సెజ్‌ల స్థాపనకు అనుమతి ఇవ్వాలని, ఈ విషయంలో ప్రభుత్వం తగు జాగ్రత్తలు వహించాలని అంటున్నారు డా. యిమ్మానేని సత్యసుందరం

భారతదేశ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. అయితే, ప్రధాన సమస్యలైన దారిద్య్రం, నిరుద్యోగం పరిష్కరించుకోలేకపోయాం. ఇటీవల కాలంలో సగటు అభివృద్ధి రేటు ఎనిమిది శాతం దాటి ఉంది. ఈ రేటు మాత్రమే మన సమస్యలను పరిష్కరించలేదు. పైగా కొత్త సమస్యలను సృష్టించవచ్చు. అభివృద్ధి రేటుతోపాటు అభివృద్ధి తీరుకూడా ముఖ్యమే. అభివృద్ధి ఫలాలు అన్నివర్గాలకు, అన్ని ప్రాంతాలకు అందాలి. అదే నిజమైన ప్రగతి. ఈ విషయంలో మనదేశం ఆశించిన విజయం సాధించలేదు.
Read the rest of this entry »

Written by Polepally InSolidarity

July 1, 2008 at 2:54 am

Posted in Articles, Telugu, Veekshanam

Tagged with , ,

మహాసెజ్‌గా మారనున్న హైదరాబాద్‌

leave a comment »

సెజ్‌లనూ తూర్పు ఇండియా కంపెనీని పోల్చి చూపుతూ, సెజ్‌ విధానం వల్ల హైదరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలను కళ్లకు కడుతున్నారు డా. ఘంటా చక్రపాణి

చరిత్ర పునరావృతమవుతుందన్న సత్యాన్ని ఎన్నో సంఘటనలు, సందర్భాల తరువాత ఆవిష్కరించి ఉంటారు. ప్రతిరోజూ సూర్యుడు తూర్పున ఉదయించడం, పడమట అస్తమించడం గమనించి భూమి గుడ్రంగా ఉంటుందని, పదే పదే అదే కక్ష్యలో తిరుగుతుందనీ అర్థం చేసుకొన్నట్లే చరిత్ర గమనంలో కూడా గతించిన సందర్భాలు మళ్లీ మళ్లీ ఎదురవడం చూసి పునరావృతమవుతుందన్న నిర్ధారణకొచ్చి ఉంటారు. అలాంటి సందర్భమే ఇప్పుడు మళ్లీ వచ్చింది. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

July 1, 2008 at 2:15 am

పోలేపల్లి ప్రజల పోరుబాట

leave a comment »

సెజ్‌ల కోసం పంట భూములు గుంజుకొని, బిచ్చంగా రెండు రూపాయల బియ్యం ఇస్తున్న ప్రభుత్వ దుర్మార్గాన్ని, నిర్వాసితుల బాధల్ని వివరిస్తున్నారు గీతాంజలి

ఊర్లల్లో మూఢనమ్మకాలు, దారిద్య్రం, కరువు, వలసలు, ఆకలి కారణాలుగా మాస్‌ హిస్టీరియా (పూనకం) వస్తుంది. దాని వెనకాల ఉన్న పైన ఉదహరించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు,వాటి పరిష్కారాల జోలికి పోకుండా ప్రభుత్వం ఊర్లల్లోకి ఆ అమాయకమైన ప్రజల దగ్గరికి సైకియాట్రిస్ట్‌లను, మెజిషియన్స్‌ను, కౌన్సిలర్స్‌ను పంపిస్తుంది. వాళ్లు కౌన్సిలింగు జిమ్మిక్కులు చేసి బాణామతి, చేతబడి, పూనకాలు అన్ని కూడా మూఢనమ్మకాలనీ, కొన్నేమో మానసిక వత్తిడివల్ల వచ్చిన సమస్యలని వివరించి మళ్లీ పట్నాల్లోకి తమ కార్పొరేట్‌ ఫైవ్‌స్టార్‌ హాస్పిటల్స్‌లో వచ్చి పడిపోతారు. ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది.
Read the rest of this entry »

Written by Polepally InSolidarity

July 1, 2008 at 2:12 am

రాష్ట్రంలో రెండు సెజ్‌ల కథ

leave a comment »

ప్రజా ప్రయోజనాల్ని కాలరాచి, ప్రభుత్వమే దళారీ అవతారమెత్తి సెజ్‌ల ముసుగులో చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం గురించి చెబుతున్నారు కొణతం దిలీప్‌

ఒకటేమో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం పొందిన పోలేపల్లి సెజ్‌, మరొకటి ఎవరికీ తెలియని జార్జియా టెక్‌ విజ్ఞాన సిటీ సెజ్‌. బయటి నుండి చూస్తే ఈ రెండిటి మధ్యా పెద్దగా పోలికలు లేవు. అయితే రెండిట్లోనూ మనకు కొట్టొచ్చినట్టు కనపడేవి మాత్రం అవినీతి, అంతులేని దోపిడీ. ఈ రెండు సెజ్‌ల కథ తెలుసుకుంటే చాలు అసలు ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఎవరి అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టబడ్డాయో చాలా తేలికగా అర్థం అవుతుంది. ప్రభుత్వమే దళారీ అవతారమెత్తి సెజ్‌ల ముసుగులో చేస్తున్న అక్రమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారపు అసలు రంగు ఈ రెండు సెజ్‌ల కథలు మనకు చెపుతాయి.
Read the rest of this entry »

Written by dilkibaatein

July 1, 2008 at 2:07 am

ప్రజాజీవితాన్ని నాశనం చేస్తున్న సెజ్‌లు

leave a comment »

సెజ్‌ల వలన సాగుభూమి, తాగునీరు, సాగునీరు, పర్యావరణాలను రైతులు నష్టపోతున్నారని, మొత్తంగా ఇదొక సామాజిక విధ్వంసం అని అంటున్నారు పి.వి. రమణ

దేశంలో ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వటం, పారిశ్రామికీకరణ ద్వారా కోట్లాది ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యాలుగా పార్లమెంట్‌ లో 23 జూన్‌ 2005న ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం (సెజ్‌) అమలులోకి తెచ్చింది మన ప్రభుత్వం. నిజానికి వ్యవసాయాన్ని దెబ్బ తీయడం, బడా పారిశ్రామికవేత్తలకు, బహుళజాతి కంపెనీలకు సేవ చేయటమనే సామ్రాజ్యవాద విధానలలో భాగమే ఈ సెజ్‌ల ఏర్పాటని ఆచరణలో మనకు అర్థం అయింది. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

July 1, 2008 at 2:04 am